Asianet News TeluguAsianet News Telugu

సుజనా చౌదరిపై మరో కేసు: ఇల్లు, ఆఫీసుల్లో సిబిఐ సోదాలు

కేంద్ర మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత సుజనా చౌదరిపై మరో కేసు నమోదైంది. దీంతో ఆయన నివాసంతో పాటు, కార్యాలయాల్లోనూ సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. 

Another case against Sujana Chowdary
Author
Hyderabad, First Published Jun 1, 2019, 5:03 PM IST

హైదరాబాద్‌: కేంద్ర మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత సుజనా చౌదరిపై మరో కేసు నమోదైంది. దీంతో ఆయన నివాసంతో పాటు, కార్యాలయాల్లోనూ సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. 

కర్ణాటక నుంచి వచ్చిన సీబీఐ అధికారులు హైదరాబాదులోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లోని సుజనా చౌదరి కార్యాలయంలో శనివారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. 

నగరంలో మొత్తం మూడుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బ్రాంకింగ్‌ ప్రాడ్‌ సెల్‌ టీమ్‌ సభ్యులు కూడా సోదాలు చేశారు. బెస్ట్‌ అండ్‌ కాంప్టన్  పేరుతో మాజీ సీబీఐ డైరెక్టర్ విజయరామారావ్ కుమారుడితో కలిసి సుజనా వ్యాపారం చేశారు. 

కంపెనీ పేరుతో అక్రమంగా రుణాలు తీసుకోగా, గతంలోనే ఈడీతో పాటు సీబీఐ కూడా కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.  

కేసు విచారణలో భాగంగా సుజానాచౌదరి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చెందిన నలుగురు డైరెక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసకళ్యాణ్ రావు, రామకృష్ణ వర్మ, వెంకటరమణారెడ్డి, సుధాకర్ రెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

వెంకటరమణారెడ్డి సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో కీలక డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.షెల్ కంపెనీల నిర్వహనలో కీలకంగా వెంకటరమణారెడ్డి వ్యవహరించారని ప్రచారం జరుగుతోంది. 

అలాగే హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే కర్ణాటకలోని బెస్ట్ అండ్ కాంప్లన్ పేరుతో వ్యాపారం నిర్వహించిన కేసులో సుజనా చౌదరి ఇళ్లు మరియు కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios