Asianet News TeluguAsianet News Telugu

తెలుగు అకాడమీ స్కాం: గుంటూరులో సాంబశివరావు అరెస్ట్.. మేనేజర్లతో పరిచయం, లక్షల్లో కమీషన్

రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ (telugu akademi scam) ఎఫ్‌డీల కుంభకోణం కేసులో మరో సూత్రధారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాంబశివరావు (sambasivarao) అనే వ్యక్తిని గుంటూరులో (guntur) పట్టుకున్నారు

another arrest in telugu akademi scam
Author
Hyderabad, First Published Oct 14, 2021, 7:53 PM IST

రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ (telugu akademi scam) ఎఫ్‌డీల కుంభకోణం కేసులో మరో సూత్రధారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాంబశివరావు (sambasivarao) అనే వ్యక్తిని గుంటూరులో (guntur) పట్టుకున్నారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్ట్‌ల సంఖ్క్ష్ 15కి చేరింది. బ్యాంక్ మేనేజర్లకు సాయికుమార్‌ను పరిచయం చేసింది ఈ సాంబశివరావేనని పోలీసుల దర్యాప్తులో తేలింది.

మేనేజర్లను పరిచయం చేసినందుకు గాను కమీషన్ వసూలు చేశాడు. ఈ క్రమంలోనే మస్తాన్‌వలీ, సాధనను పరిచయం చేసినందుకు గాను రూ.60 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ క్రమంలోనే సాయికుమార్, బ్యాంక్ మేనేజర్లు వైజాగ్‌లో మీటింగ్‌లు పెట్టుకున్నారు. తాజాగా సాంబశివరావును గుంటూరు నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు సీసీఎస్ పోలీసులు.

కాగా, తెలుగు అకాడమీ స్కాంలో కీలక పాత్ర పోషించిన సాయికుమార్ ఏపీలోని రెండు ప్రభుత్వ సంస్థల నుంచి కూడా (sai kumar gang) డబ్బులు కొట్టేసినట్లు దర్యాప్తులో తేలింది. ఏపీ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ (ap warehousing corporation) నుంచి రూ.10 కోట్లు కొట్టేశాడు సాయికుమార్. ఆలాగే ఏపీ సీడ్స్ కార్పోరేషన్ (ap seeds corporation) నుంచి ఐదు కోట్ల ఎఫ్‌డీలను కూడా డ్రా చేశాడని పోలీసులు తెలిపారు.

ALso Read:చెన్నై జైల్లో ‘ఎఫ్ డి స్కామ్ పాఠాలు’... తెలుగు అకాడమీ కేసులో సూత్రధారి విచారణలో విస్తుపోయే వాస్తవాలు...

మొత్తంగా ఏపీకి చెందిన రెండు సంస్థల నుంచి రూ.15 కోట్లు డ్రా చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఏపీ సంస్థలకు సంబంధించిన డిపాజిట్లను ఐఓబీ బ్యాంక్ (IOB bank) నుంచి బదిలీ చేసినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (ap govt) సీసీఎస్ పోలీసులు (ccs police) సమాచారం అందించారు. సాయికుమార్ ముఠాపై 2 కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తెలుగు అకాడమీలో కొట్టేసిన రూ.60 కోట్ల రికవరీపై దృష్టిపెట్టారు. 

మరోవైపు తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో నిందితులు సిసీఎస్ పోలీసులకు సహకరించడం లేదని తెలుస్తోంది. తాము కొల్లగొట్టిన 64 కోట్ల రూపాయలను నిందితులు ఏం చేశారనేది తేలడం లేదు. తెలుగు అకాడమీ కేసులో సీసీఎస్ పోలీసులు ఇప్పటి వరకు 14 మందిని అరెస్టు చేశారు. వారిలో 9 మందిని తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు . నిందితులు కొల్లగొట్టిన రూ.64 కోట్లలో పోలీసులు రూ.12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బులతో నిందితులు స్థలాలు, ఆభరణాలు, ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లు గుర్తిచారు. అటువంటి ఆస్తులను ఈడి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios