హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్  వద్ద ధర్నాకు దిగిన నిజామాబాద్ జిల్లా అంకాపూర్  గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లు తమకు ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారని గ్రామస్తులు చెబుతున్నారు. తమకు ఇచ్చిన హామీని వెంటనే  నెరవేర్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రగతి భవన్ లో సీఎం అపాయింట్ మెంట్ కోసం గ్రామస్తులు ప్రయత్నించారు. కానీ సీఎం కేసీఆర్  ఆంకాపూర్  గ్రామస్తులకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ప్రగతి భవన్ వద్ద ధర్నాకు దిగేందుకు వచ్చిన 52 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంకాపూర్ గ్రామస్తులను  పోలీసులు పంజగుట్ట పోలిస్ స్టేషన్ కు తరలించారు.