మిర్యాలగూడ సమీపంలో బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఇద్దరు మృతి

andhra pradesh travel bus accident in telangana
Highlights

డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమా?

ఓ బస్సు డ్రైవర్ నిదమత్తు కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. అర్థరాత్రి సమయంలో ఓ ప్రైవేట్ బస్సు  డ్రైవర్ నిద్ర మత్తు లో డ్రైవింగ్ చేయడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చిలకలూరిపేటకు చెందిన లక్ష్మీగాయత్రి ట్రావెల్స్ బస్సు నిన్న రాత్రి హైదరాబాద్ నుండి చీరాలకు ప్రయాణికలతో బయలుదేరింది. ఈ క్రమంలో బస్సు ఇవాళ తెల్లవారుజామున నల్లగొండ జిల్లా వేములపల్లి సమీపంలోని చేరుకోగానే ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదం నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై జరిగింది. బస్సు వేగంగా ఉండటంతో రోడ్డుపై రెండు మూడు పల్టీలు కొట్టింది. 


ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు ప్రకాశం జిల్లాకు చెందిన సుబ్బరావమ్మ(55), బొబ్బాయిపల్లికి చెందిన నాగేశ్వర్‌రావు(31) లుగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయాలపాలైన ప్రయాణికులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ  ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగే కారణమని తెలుస్తోంది. అతడు తెల్లవారుజామున నిద్ర మత్తులో ఉండి కూడా డ్రైవింగ్ కొనసాగించడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనిపై సమగ్ర విచారణ జరిపి ప్రమాద వివరాలను తెలియజేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
 

loader