Asianet News TeluguAsianet News Telugu

నిమ్మగడ్డకు హైకోర్టు షాక్: ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ సస్పెండ్

స్థానిక సంస్థల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో సోమవారం నాడు ఊరట లభించింది. ఎస్ఈసీ విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను సస్పెండ్ చేసింది హైకోర్టు.

 

andhra pradesh high court suspends AP SEC local body election schedule lns
Author
Guntur, First Published Jan 11, 2021, 4:46 PM IST

అమరావతి: స్థానిక సంస్థల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో సోమవారం నాడు ఊరట లభించింది. ఎస్ఈసీ విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను సస్పెండ్ చేసింది హైకోర్టు.

 

 

వ్యాక్సినేషన్ కు ఎన్నికల ప్రక్రియ అడ్డొస్తోందని హైకోర్టు భావించింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది.

also read:రూల్స్ బ్రేక్: ఎస్ఈసీ జాయింట్ డైరెక్టర్ జీవీ సాయిప్రసాద్ పై నిమ్మగడ్డ వేటు

ఈ నెలలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ నెల 16వ తేదీ నుండి వ్యాక్సినేషన్ చేయనున్నట్టుగా కేంద్రం  ఆయా రాష్ట్రాలకు సమాచారం అందించింది.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను ఏపీ ఎన్నికల సంఘం ఇటీవలనే విడుదల చేసింది. ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

కరోనాను కట్టడి చేసేందుకు చేపట్టిన వ్యాక్సిన్ ప్రక్రియకు స్థానిక సంస్థల ఎన్నికలు అడ్డంకిగా మారే అవకాశం ఉందని హైకోర్టు భావించింది. ఈ తరుణంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ను హైకోర్టు సోమవారం నాడు కొట్టేసింది.

ఆర్టికల్ 14, 21 ని ఉల్లంఘించేలా ఎస్ఈసీ నిర్ణయం తీసుకొందని హైకోర్టు అభిప్రాయపడింది. 

పంచాయితీ ఎన్నికలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ రెండు గంటల పాటు వాదనలు విన్పించారు. ఏక కాలంలో ఎన్నికలు, కరోనా వ్యాక్సిన్ కష్టంగా మారుతుందని ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు.

ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేసులో ఊరట లభించింది. మరోవైపు ఈ తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ కు వెళ్లాలని ఎస్ఈసీ భావిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios