రూల్స్ బ్రేక్: ఎస్ఈసీ జాయింట్ డైరెక్టర్ జీవీ సాయిప్రసాద్ పై నిమ్మగడ్డ వేటు
క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం నాడు ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి: క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం నాడు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయిప్రసాద్ నిబంధనలను ఉల్లంఘించారని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఆగ్రహంగా ఉన్నారు.నిబంధనలను ఉల్లంఘించిన సాయి ప్రసాద్ పై వేటు వేశారు.
30 రోజుల పాటు సెలవుపై వెళ్లిన జీవీ సాయి ప్రసాద్ ఇతర ఉద్యోగులను ప్రభావితం చేయడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ యాక్షన్ తీసుకొంది.
ప్రస్తుత ఎన్నికల కార్యక్రమానికి విఘాతం కల్గిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హెచ్చరికలు పంపారు.
ఆర్టికల్ 243 రెడ్ విత్, ఆర్టికల్ 324 ప్రకారం విదుల నుండి తొలగిస్తామని ఎస్ఈసీ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా లేదు. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణను వాయిదా వేయాలని కోరుతోంది.
చంద్రబాబునాయుడు డైరెక్షన్ లో ఎస్ఈసీ పనిచేస్తున్నారని అధికార వైసీపీ ఆరోపణలు చేస్తోంది.