తెలంగాణ సిఎం కేసిఆర్ కు సీమాంధ్రలో ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకూ పెరిగిపోతున్నది. తెలంగాణ వచ్చిన కొత్తలో సందు సందులో కేసిఆర్ చిత్ర పటాల మీద పాలాభిషేకం కురిసింది. అయితే గత ఏడాది కాలంగా పాలాభిషేకాలు తగ్గిపోయాయి. గతంలో వందల సంఖ్యలో ఉంటే ఇప్పుడు నెలకొకటి కూడా లేకుండాపోయింది.

కానీ ఇప్పుడు సీన్ సీమాంధ్రకు మారింది. విజయవాడలో మొన్న యాదవులు కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. యాదవులకు రాజ్యసభ సీటు, యాదవ భవనం కోసం స్థలం ఇవ్వడాన్ని హర్షిస్తూ వారు పాలాభిషేకం చేశారు.

ఇప్పుడు ముదిరాజ్ లు కూడా యాదవుల బాట పట్టారు. విజయవాడ లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ముదిరాజ్ సంఘం నేతలు. తెలంగాణ లో కేసీఆర్ ముదిరాజ్ లకు 5 కోట్ల నిధులు, ముదిరాజ్ భవన్ నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయింపు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎపీలో కూడా ముదిరాజ్ లకు చంద్రబాబు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

పాలాభిషేకం వీడియో కింద ఉంది చూడండి.