బయల్పడిన హనుమాన్ విగ్రహం.. అక్కడే ప్రతిష్టించాలని పట్టు

First Published 24, Jun 2018, 10:13 AM IST
ancient Hanuman Idol found in Samshabad
Highlights

బయల్పిడిన హనుమాన్ విగ్రహం.. అక్కడే ప్రతిష్టించాలని పట్టు

హైదరాబాద్ శంషాబాద్‌లో అరుదైన ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న సామా ఎన్‌క్లేవ్‌లో ఇంటి స్థలం శుద్ధి చేస్తుండగా.. ఓ పురాతన హనుమాన్ విగ్రహం బయటపడింది.. దీంతో ఇంటి యజమానులు సంబరాల్లో ముగినిపోయారు.. విగ్రహాం బయటపడిన విషయాన్ని ఫ్లాట్ యజమానులు పురావస్తుశాఖ అధికారులకు తెలియజేశారు.. సమాచారం అందుకున్న ఆర్కియాలజి అధికారులు శంషాబాద్ చేరుకుని విగ్రహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. ఏబీవీపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని విగ్రహా తరలింపును అడ్డుకున్నారు.. ఇదే ప్రాంతంలో ఆంజనేయుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తామని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. వెంటనే టెంట్ ఇతర పూజా సామాగ్రిని తెప్పించి.. ప్రత్యేక పూజలు చేశారు.. విగ్రహాం బయటపడిన విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

loader