తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మకు ప్రభుత్వంలో సముచితమైన పదవి ఇచ్చి గౌరవించాలని సీఎం కేసీఆర్ భావించారు. ఈ విషయంలో నేటి సాయంత్రం కీలక ప్రకటన వెలుడవే అవకాశం కనిపిస్తోంది.  

తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిలూది అమరడైన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు బీఆర్ఎస్ ప్రభుత్వం సముచిత పదవి కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ లోని నూతన సచివాలయం సమీపంలో నిర్మించిన అమరజ్యోతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమెను ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేపై బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు

ఈ విషయంలో ఇప్పటికే విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డితో సీఎం కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారని తెలుస్తోంది. ఆమెను అమరజ్యోతి కార్యక్రమానికి ఆహ్వానించాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ప్రభుత్వంలో ఏదైనా ఒక సముచిత పదవినిచ్చి గౌరవించాలని సీఎంకు మంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే మంత్రి విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. ఈ విషయంలో నేటి సాయంత్రం కీలక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.