వరంగల్ అర్బన్ జిల్లాకు అవార్డు ప్రకటించిన కేంద్రం ఉన్నత్‌ భారత్‌ అభియాన్‌ అవార్డును అందుకోనున్న ఆమ్రపాలి

వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి ఖాతాలోకి మరో అవార్డు వచ్చి చేరింది. ఉన్నత్‌ భారత్‌ అభియాన్‌ అవార్డును ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ అర్బన్ జిల్లాకు వచ్చింది. ఆ అవార్డును ఆమ్రపాలి అందుకోనున్నారు.

వరంగల్ అర్బన్ జిల్లాలోని కమలాపూర్‌ మండలం శంభునిపల్లి గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం ‘ఉన్నత్‌ భారత్‌ అభియాన్‌’ అవార్డును ప్రకటించింది. ఆ అవార్డును అందుకునేందుకు బుధవారమే కలెక్టర్ ఆమ్రపాలి ఢిల్లీ వెళ్లారు.

నేడు కలెక్టర్‌ అమ్రపాలి ఢిల్లీలో అవార్డును అందుకోనున్నారు. కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ చేతులమీదుగా ఈ అవార్డు కలెక్టర్‌ స్వీకరించనున్నారు.

మొత్తానికి తాను ఏం చేసినా సంచనలమే అవుతున్నది. దానికితోడు తాను కలెక్టర్ గా ఉన్న జిల్లాలోనూ ఆమెకు అవార్డులు రావడం పట్ల జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి