తెలుగు కలెక్టరమ్మ ఆమ్రపాలికి కాబోయే వరుడు ఎలా ఉంటాడా అని ఆమె గురించి అవగాహన ఉన్న అందరిలో ఒకటే టెన్షన్. చిన్న వయసులో కలెక్టర్ అయిన ఆమ్రపాలికి వచ్చే భర్త ఆమె కంటే అందగాడే అన్న ప్రచారం ఉంది. ఆమ్రపాలి ఐఎఎస్ అధికారి అయితే.. ఆమెకు కాబోయే భర్త ఐపిఎస్ అధికారి. ప్రస్తుతం ఆమ్రపాలి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తుంటే ఆమ్రపాలికి కాబోయే భర్త సమీర్ శర్మ కేంద్ర సర్వీసులో పనిచేస్తున్నారు.

ఆయన సొంతూరు ఢిల్లీ. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో భాగంగా డామన్ డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన 2011 బ్యాచ్ ఐపిఎస్ అధికారి. సమీర్ శర్మ చూడడానికి ఆమ్రపాలి కంటే అందగాడే కదా అని అతడి ఫొటోలు నెట్ లో చూసిన జనాలు అనుకుంటున్నారు.

అయితే వీరిద్దరూ గత కొంతకాలంగా లవ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. తన పెళ్ళి గురించి ఇటీవల కలెక్టర్ ఆమ్రపాలి వరంగల్ జిల్లా మీడియా వారికి.. జిల్లా ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వారి ద్వారా ప్రపంచానికి తెలిసింది. సో ఆమ్రపాలి నాలుగు వారాల్లో పెళ్లి పీటలు ఎక్కనుంది. మరి మనందరం ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా...