షాక్ ఇచ్చిన కలెక్టర్ ఆమ్రపాలి

షాక్ ఇచ్చిన కలెక్టర్ ఆమ్రపాలి

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఐఎఎస్ అధికారి ఎవరు?  అని అడిగితే ఠక్కున చెప్పే వరంగల్ అర్బన్ కలెక్టర్. ఆమె తెలంగాణ రాష్ట్రంలో తొలి కలెక్టర్ గా వరంగల్ అర్బన్ జిల్లాకు ఎంపికయ్యారు. అప్పటి నుంచి ఆమ్రపాలి పేరు ప్రతిరోజు వార్తల్లోకి ఎక్కుతున్నాది. అంతేకాదు ఆమె ప్రతిరోజు జనాల్లోనే ఉంటున్నారు. దీంతో ఆమె తాలూకు వార్తలు జనాల్లో చర్చనీయాంశమవుతూ ఉంటాయి.

అనేక సందర్భాల్లో ఆమ్రపాలి కలెక్టర్ పోస్టుకు కొత్తదనం తీసుకొచ్చిన పరిస్థితులున్నాయి. వేదికల మీద బిగబట్టి కూర్చోకుండా ఆమె డ్యాన్స్ లు చేస్తూ అందరిలో జోష్ నింపిన దాఖలాలున్నాయి. కొండలు, గుట్టలెక్కుతూ హల్ చల్ చేశారు. అడవుల్లో నడుస్తూ కొత్త రికార్డులు సృష్టించారు. ఇందుకు భిన్నంగా మరోసారి ఆమ్రపాలి వార్తల్లో నిలిచారు.

తాజాగా ఆమ్రపాలి రెవెన్యూ అధికారులకు షాక్ చ్చారు. జిల్లాలోని కమలాపూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె ఒక్కసారిగా తహశీల్దార్ కార్యాలయం రావడంతో కమలాపూర్ మండల అధికారులు హైబత్ తిన్నారు. హడావిడిగా కలెక్టర్ కు స్వాగతం పలికారు. వెంటనే ఎమ్మార్వో సీటులో ఆమెను కూర్చోబెట్టారు. మిగతా అధికారులంతా ఆమెకు నమస్కరిస్తూ స్వాగతం పలికారు.

కమలాపూర్ ఎమ్మార్వో ఆఫీసును ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా పలు అంశాలపై ఆమ్రపాలి అధికారులతో ముచ్చటించారు. ముఖ్యంగా భూముల క్రమబద్ధీకరణపై రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూముల క్రమబద్ధీకరణ ఎంతవరకు వచ్చింది? తదుపరి ఏరకమైన కార్యాచరణ చేపడుతున్నారని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos