Asianet News TeluguAsianet News Telugu

అమిత్ షా తెలుగు ట్వీట్.. కేసీఆర్‌పై విమర్శలు.. కేటీఆర్ కౌంటర్ ట్వీట్

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దృష్టి రాష్ట్రంపై పడింది. దీనిలో భాగంగా మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగసభలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా క్యాడర్‌లో ఉత్సాహన్ని నింపేందుకు ప్రయత్నించారు. 

Amit shah tweets on telangana gove for not implementing the ayushman bharat scheme
Author
Hyderabad, First Published Sep 25, 2018, 9:26 AM IST

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దృష్టి రాష్ట్రంపై పడింది. దీనిలో భాగంగా మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగసభలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా క్యాడర్‌లో ఉత్సాహన్ని నింపేందుకు ప్రయత్నించారు. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఇక ఎన్నికల ప్రచారంలో స్పీడ్‌గా వెళుతున్న టీఆర్ఎస్‌పై ఫోకస్ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతూ.. అదే సమయంలో టీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు.

ప్రధాని ప్రారంభించిన ‘‘ జన ఆరోగ్య యోజన- ఆయుష్మాన్ భారత్’’ కార్యక్రమం గొప్పదని.. కానీ ఈ పథకాన్ని తెలంగాణ ప్రజలకు అందకుండా అక్కడి ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమని... టీఆర్ఎస్ ప్రభుత్వ  స్వార్థ ఆలోచన కారణంగానే అక్కడి ప్రజలు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందలేకపోతున్నారని ఆరోపించారు. దీనిపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని.. ప్రజలు కూడా టీఆర్ఎస్‌ను నిలదీయాలని అమిత్ షా ట్వీట్‌లో పేర్కొన్నారు.

దీనిపై మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ అమిత్ షా.. మీకు తప్పుడు సమాచారం అందింది.. తెలంగాణలో అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ పథకం 80 లక్షల మందికి మేలు చేస్తోంది. కానీ ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో కేవలం 25 లక్షల మందికే ప్రయోజనం కలిగిస్తోందన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios