ఉమ్మడి మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని పట్టణ ఓటర్లను లక్ష్యం చేసుకుని అమిత్ షా వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు. అమిత్ షా నేతృత్వంలో దేశంలో 20 రాష్ట్రాల్లో బిజెపి పాగా వేసింది. ఇతర రాష్ట్రాల్లో సాధ్యమైనప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని బిజెపి రాష్ట్ర నేతలు అంటున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడానికి బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా వ్యూహరచన చేస్తున్నారు. మిషన్ 60 ప్లస్ లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగి ఆ లక్ష్యాన్ని సాధించడానికి శ్రమించాలని ఆయన కార్యకర్తలను ఆదేశించారు. ఇందులో భాగంగా ఆయన బుధవారం కరీంనగర్ లో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని పట్టణ ఓటర్లను లక్ష్యం చేసుకుని అమిత్ షా వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు. అమిత్ షా నేతృత్వంలో దేశంలో 20 రాష్ట్రాల్లో బిజెపి పాగా వేసింది. ఇతర రాష్ట్రాల్లో సాధ్యమైనప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని బిజెపి రాష్ట్ర నేతలు అంటున్నారు.
రాష్ట్ర నాయకులతో వరుస సమావేశాలు నిర్వహించి అభ్యర్థుల పేర్లను అమిత్ షా ఖరారు చేశారు. కరీంనగర్ లో జరిగే సభలో ఆయన అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. రాష్ట్ర నాయకత్వం మూడు రోజుల పాటు సమావేశమై అభ్యర్థులను ఎంపిక చేసి ప్రతిపాదనలు ఇచ్చింది.
టీఆర్ఎస్, కాంగ్రెసు పార్టీల్లో టికెట్లు దక్కనివారిని తమ పార్టీలోకి అహ్వానించాలనే ఉద్దేశంతో బిజెపి నాయకత్వం ఉంది. ఇప్పటికే ఆందోల్ టికెట్ దక్కని బాబూ మోహన్ బిజెపిలో చేరారు. మరింత మంది తమ పార్టీలోకి వస్తారని బిజెపి నాయకులు భావిస్తున్నారు.