తెలంగాణపై బీజేపీ అధిష్టానం దృష్టిసారించింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది.

తెలంగాణపై బీజేపీ అధిష్టానం దృష్టిసారించింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. ఇప్పటికే ఢిల్లీలో టీ బీజేపీ నేతలతో బీజేపీ అగ్రనేతలు కీలక భేటీలు నిర్వహించారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ కూడా చర్చనీయాంశంగా మారింది. తాజాగా తెలంగాణలో బీజేపీ ఈ నెలలో రెండు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసింది. మహాజన్‌ సంపర్క్ అభియాన్‌ అభియాన్‌లో భాగంగా తెలంగాణలో నిర్వహించే రెండు వేర్వేరు సభలకు అమిత్ షా, జేపీ నడ్డాలుహాజరుకానున్నారు. 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 15న ఖమ్మం రానున్నారు. అదే రోజు సాయంత్రం ఖమ్మంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక, ఈ నెల 25న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాగర్ కర్నూలులో ఏర్పాటు చేసిన సభకు హాజరు కానున్నారు. అయితే రాష్ట్రానికి మరింత మంది బీజేపీ అగ్రనేతలను తీసుకొచ్చేందుకు ఆ పార్టీ తెలంగాణ యూనిట్ ప్రణాళికలు రచిస్తోంది. మోదీ కూడా తెలంగాణలో బహిరంగ సభ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. 

ఇక, బీజేపీ అధికారం చేపట్టి తొమ్మిదేళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని మోదీ విజయాలను మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న మహాజన్ సంపర్క్ అభియాన్ సభలకు బీజేపీ అగ్రనేతలు హాజరవుతున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యుహాలు రచిస్తున్న బీజేపీ అధిష్టానం.. ఇక్కడ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నిర్వహించనున్న 2 భారీ బహిరంగ సభలకు అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలు హాజరుకానున్నారు.