Asianet News TeluguAsianet News Telugu

కరోనా వేళ తెలంగాణ ఆరోగ్య శాఖలో కీలక అధికారుల బదిలీ, కారణం....

వైద్య ఆరోగ్య శాఖా సంక్షేమ ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహిస్తున్న శాంతకుమారిని,  పబ్లిక్ హెల్త్ కమీషనర్ గా  నిర్వర్తిస్తున్న యోగితా రాణాలకు  ప్రాధాన్యం లేని పోస్టింగులను ఇచ్చారు. 

Amidst corona Pandemic, Telangana govt shifts 2 top health officials
Author
Hyderabad, First Published Jul 16, 2020, 9:10 AM IST

తెలంగాణాలో కరోనా ఉధృతంగా విజృంభిస్తున్న వేళ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఇద్దరు ప్రధానాధికారులను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

వైద్య ఆరోగ్య శాఖా సంక్షేమ ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహిస్తున్న శాంతకుమారిని,  పబ్లిక్ హెల్త్ కమీషనర్ గా  నిర్వర్తిస్తున్న యోగితా రాణాలకు  ప్రాధాన్యం లేని పోస్టింగులను ఇచ్చారు. 

శాంతకుమారిని అటవీ శాఖకు బదిలీచేయగా, యోగితా రాణాను  సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.వీరితోపాటుగా మరో 13 మంది ఐఏఎస్ లను సైతం ప్రభుత్వం బదిలీ చేసింది. 

కరోనా వైరస్ మహమ్మారిని హ్యాండిల్ చేసే విషయంలో ప్రభుత్వం ఈ ఇద్దరి అధికారుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలియవస్తుంది. ముఖ్యంగా శాంతకుమారి పనితీరుపై బాగా అసంత్రుప్తిగా ఉన్నట్టుగా సన్నిహిత వర్గాల సమాచారం. చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, శాంతకుమారి ఇద్దరు ఒకే బ్యాచ్ కి చెందిన అధికారులు అవడం గమనార్హం. 

ఇద్దరు ఒకే బ్యాచ్ కి చెందినవారు అవడం వల్ల వారి మధ్య సమాచార వినిమయం కష్టతరమవుతుందని, జూనియర్ నుంచి చీఫ్ సెక్రెటరీగా సోమేశ్ కుమార్ సమాచారాన్ని తీసుకోవడం తేలిక, కానీ ఇక్కడ ఈ అంశం కష్టంగా మారినట్టు సమాచారం. 

దానితోపాటుగా తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వానికి పిటిషన్ ఇచ్చారు. తమ జీతాలను గనుక పెంచుకుంటే, (సంవత్సరం నుండి పెండింగ్ లో ఉన్నపే రివిజన్ గనుక చేయకపోతే) 20వతేది నుండి స్ట్రైక్ కి దిగుతామని హెచ్చరించారు. 

ప్రొమోషన్లను ముందుకుసాగనీయకుండా ఆ ఫైల్ శాంతకుమారి ఛాంబర్ లో సంవత్సరం నుండి ఆగినట్టు వారు ఆరోపించారు. వాకాటి కరుణను  హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ గా తిరిగి నియమించారు.  వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఢిల్లీలోని తెలంగాణ  నిర్వహిస్తున్న సయ్యద్‌ అలీ ముర్తుజా రజీని నియమించారు. 

మొత్తంగా 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలకు సంబంధించి పూర్తి వివరాలు.... 

అడిషనల్ సీఈవో-జ్యోతి బుద్ధప్రకాష్‌

వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి-సయ్యద్‌ అలీ ముర్తుజా రజీ
అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా-శాంతికుమారి
ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్‌-అదర్‌ సిన్హా
నాగర్‌కర్నూల్‌ కలెక్టర్-ఎల్‌ శర్మన్‌
పాఠశాల విద్యా డైరెక్టర్‌-శ్రీదేవసేన
హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌-వాకాటి కరుణ
పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి-కేఎస్‌ శ్రీనివాసరాజు
సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి-విజయ్‌కుమార్‌
సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌-యోగితా రాణా
సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జా కొనసాగింపు
ఆదిలాబాద్‌ కలెక్టర్‌-సిక్తా పట్నాయక్‌
పెద్దపల్లి ఇంచార్జ్‌ కలెక్టర్-భారతీ హోలీకేరి
గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి-ఇ. శ్రీధర్‌
కార్మిక, ఉపాధి కల్పనశాఖ కార్యదర్శి-రాణి కుముదిని దేవి
తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు..
పర్యావరణ శాస్త్ర సాంకేతిక అదనపు బాధ్యతలు రజత్‌కుమార్‌కు అప్పగింత

Follow Us:
Download App:
  • android
  • ios