భూ వివాదంలో అరెస్ట్ అయిన అంబర్‌పేట్ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌పై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 

భూ వివాదంలో అరెస్ట్ అయిన అంబర్‌పేట్ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌పై తెలంగాణ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా.. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ శివార్లలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో సీఐ సుధాకర్‌పై కేసు నమోదైంది. ఓ ఎన్ఆర్ఐకి భూమి ఇస్తానని సీఐ రూ.50 లక్షలు తీసుకున్నట్లు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. కందుకూరు మండలంలోని ఓ గ్రామంలో వ్యవసాయ భూమి విక్రయిస్తామని డబ్బులు తీసుకున్నప్పటికీ నెలలు గడుస్తున్నా భూమి రిజిస్ట్రేషన్ చేయలేదు. దీంతో మోసాన్ని గ్రహించిన బాధితుడు వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ సుధాకర్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.