Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి... ముందుకొచ్చిన అమెజాన్...

అమెజాన్ వెబ్ సర్వీసేస్ తెలంగాణ రాష్ట్రంలో 20 వేల 761 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. తన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా ఏషియా పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు అమెజాన్ నిర్ణయం తీసుకుంది. 

Amazon Web Services Company in Hyderabad - bsb
Author
hyderabad, First Published Nov 6, 2020, 12:09 PM IST

అమెజాన్ వెబ్ సర్వీసేస్ తెలంగాణ రాష్ట్రంలో 20 వేల 761 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. తన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా ఏషియా పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు అమెజాన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైదరాబాదులో మూడు అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేయనుంది. ప్రతి అవైలబిలిటీ జోన్లో అనేక డాటా సెంటర్ల ఏర్పాటు. 

అమెజాన్ వెబ్ సర్వీసెస్ 2022 సంవత్సరం ప్రథామార్దం లో తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ మేరకు అమెజాన్ భారీ పెట్టుబడిని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇదే మొదటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని సంతోషం వ్యక్తం చేశారు. 

ఇంత భారీ పెట్టుబడి రావడం అంటే తెలంగాణ ప్రభుత్వ విధానాలకు ఉన్న ప్రాధాన్యత అర్థం అవుతుందని కేటీఆర్ అన్నారు. పారదర్శక, వేగవంతమైన పరిపాలన విధానాల వల్లనే తెలంగాణకు భారీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. 

తన దావోస్ పర్యటనలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ను కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. అంతేకాదు అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడి తర్వాత తెలంగాణ డేటా సెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానం గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ పెట్టుబడులతో ఇప్పటికే తెలంగాణలో అతిపెద్ద కార్యాలయం ఉన్న అమెజాన్ సంస్థతో రాష్ట్రకు బంధం మరింత బలోపేతం అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios