హైదరాబాద్: ఏ కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ తన ఇద్దరి పిల్లతో కలిసి ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాను చనిపోతే తన పిల్లలకు దిక్కెవరని అనుకుందో ఏంటో చావులో కూడా తనతోపాటే తీసుకుపోవాలనుకుంది. అంతే తన పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది.  

వివరాల్లోకి వెళ్తే అల్వాల్ లో ఓ మహిళ తన ఇద్దరి పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ప్రమాదంలో బాలిక మృతి చెందగా, తల్లి మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.