హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు దేశ వ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి జరుగుతున్నాయి. కొన్ని చోట్ల సాయంత్రం 6గంటల వరకు ముగియనుండగా, మరికొన్ని చోట్ల సాయంత్రం 4గంటలు లేదా 5గంటల వరకు పోలింగ్ జరగనుంది.

ఈ నేపథ్యంలో ఓటు వేయాలంటే ఓటర్ ఐడీ కార్డు తప్పనిసరి అని చాలా మందికి తెలిసిన విషయమే. అయితే, ఒక వేళ ఓటర్ ఐడీ లేకపోయినప్పటికీ ప్రత్యామ్నాయంగా ఇతర గుర్తింపు కార్డులను ఉపయోగించి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.

ఓటర్ గుర్తింపు కార్డుకు బదులుగా ఈ కింది ప్రత్యామ్నాయ ధృవీకరణ పత్రాలు ఉపయోగించి మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

1. ఆధార్ కార్డ్
2. పాన్ కార్డ్
3. పాస్ పోర్ట్
4. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, పీఎస్‌యూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసిన ఫొటో గల సర్వీసు గుర్తింపు కార్డులు
5. ఎన్‌పీఆర్ కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్
6. ఎంఎన్ఆర్‌జీఏ జాబ్ కార్డ్
7. కార్మిక మంత్రిత్వశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్
8. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు
9. బ్యాంకులు/పోస్టాఫీసులు జారీ చేసిన ఫొటో గల పాస్ పుస్తకాలు
10. డ్రైవింగ్ లైసెన్స్
11. ఫొటో గల పింఛను పత్రం.