ఓ కార్పోరేటర్ కుమారుడు దౌర్జన్యానికి తెగబడ్డాడు. మహిళ ఫ్లాట్ కు వెళ్లి మరీ బీభత్సం సృష్టించారు. సామాన్లు పగలగొట్టి భయబ్రాంతుల్ని చేశాడు. ఇంతకీ అలా చేయడానికి కారణాలేంటి అనేది మాత్రం ఇంకా...

హైదరాబాద్ : Allwyn Colony Corporator కుమారుడు రామకృష్ణ గౌడ్ ఓ మహిళ ఇంటి పైకి వెళ్లి outrageకి దిగాడు. సదరు మహిళ ఇంట్లో లేకపోవడంతో వస్తువులను, పూల కుండీలను ధ్వంసం చేయడమే కాక చంపుతాను అంటూ హెచ్చరిస్తూ నానా రభస చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 
KPHB పోలీస్స్టేషన్ పరిధిలోని ద్వారకామయి మిత్ర హిల్స్ లోని ఓ ఫ్లాట్లో రత్నమాణిక్యం ఉంటుంది. ఈనెల 16 న తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళింది.

మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ కుమారుడు రామకృష్ణ గౌడ్ ఆమె ఫ్లాట్ కు వచ్చాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో.. కోపంతో ఊగిపోతూ.. ఇంటి బయట ఉన్న పూల కుండీలు, సింక్, కిటికీలు ధ్వంసం చేశాడు. గట్టిగా కేకలు వేస్తూ అక్కడి వస్తువులు ఎత్తేశాడు. నిన్ను చంపేస్తాను అంటూ అరుస్తూ వెళ్ళిపోయాడు. ప్లాట్ లోని వారు వెంటనే రత్న మాణిక్యమ్మకు సమాచారం అందించారు. ఇంటికి చేరిన ఆమె జరిగిన ఘటన గురించి తెలుసుకొని కెపిహెచ్బి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేందర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కార్పొరేటర్ కుమారుడు ఈ దౌర్జన్యానికి పాల్పడడానికి గల కారణాలు తెలియరాలేదు. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపల్లి గ్రామ వీఏఓ గరికపాటి నాగలక్ష్మి ఆత్మహత్య ఉదంతం… వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు పోలీసులు ఎంతలా తలొగ్గుతున్నారో, వారు చెబితే లైంగిక వేధింపుల ఫిర్యాదుల పైనా కేసు పెట్టకుండా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారబ చెప్పేందుకు తార్కాణంగా నిలుస్తుంది. వైసీపీ గ్రామ స్థాయి నాయకుడు గరికపాటి నరసింహారావు లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని దుర్భాషలాడుతూ… ప్రభుత్వ కార్యాలయంలోనే దాడికి ప్రయత్నించాడని ఫిబ్రవరి 24నే ఆమె బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. కిందిస్థాయి అధికారులు ఆ నాయకుడు ఒత్తిళ్లకు తలొగ్గారని.. అదే ఎస్పి అయితే న్యాయం చేస్తారని భావించి.. స్పందన కార్యక్రమంలో ఈ నెల 14న నేరుగా కృష్ణా జిల్లా SP Siddharth Kaushalకు ఆమె ఫిర్యాదు చేసింది.

అక్కడా స్పందన రాలేదు. ఎస్పీయే తనకు న్యాయం చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారంటూ నిస్సహాయస్థితిలో ఆ తర్వాత రెండు రోజులకే అంటే ఈ నెల 16న ఆత్మహత్యకు పాల్పడి 17వ తేదీ ఉదయం 4.45 గంటలకు చికిత్స పొందుతూ మరణించారు. ఆమె ప్రాణాలతో ఉన్నప్పుడు ఫిర్యాదుపై చర్యలు తీసుకోని పోలీసులు.. నాగలక్ష్మి మరణం తర్వాత విమర్శలు వెల్లువెత్తుతుండడంతో స్పందనలో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 16న లైంగిక వేధింపుల, బెదిరింపుల సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు మీడియాకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 17వ తేదీన నాగలక్ష్మి కుమారుడు పార్థశివసాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదేరోజు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేసినట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. నిందితుడిని వెనక నిల్చోబెట్టి, ముందు వరుసలో డిఎస్పి మొదలు కిందిస్థాయి సిబ్బంది వరకు కూర్చుని తీయించుకున్న ఫోటోలు మీడియాకు విడుదల చేశారు.