Asianet News TeluguAsianet News Telugu

విద్యార్థుల మైండ్ బ్లాంక్: అందరికీ సున్నా మార్కులే

ఈ నెల 1న పాలిటెక్నిక్‌ డిప్లొమా చివరి ఏడాది ఫలితాలను బోర్డు విడుదల చేసింది. ఫలితాలు చూసుకుని విద్యార్థుల మైండ్ బ్లాంక్ అయింది. ఈసెట్‌–2019 టాప్‌ ర్యాంకర్లు సైతం ఫెయిలయ్యారు.

All the students get zero marks
Author
Hyderabad, First Published Jun 4, 2019, 7:18 AM IST

హైదరాబాద్‌: ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన తప్పిదాలను మరిచిపోక ముందే సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు (టీఎస్ఎస్ బీటీఈటీ)లోనూ అటువంటి తప్పిదాలే చోటు చేసుకున్నాయి.  పరీక్ష రాసిన విద్యార్థులందరినీ బోర్డు ఫెయిల్‌ చేసింది. విద్యార్థులందరికీ చివరి సెమిస్టర్‌లో సున్నా మార్కులు వచ్చాయి. 

ఈ నెల 1న పాలిటెక్నిక్‌ డిప్లొమా చివరి ఏడాది ఫలితాలను బోర్డు విడుదల చేసింది. ఫలితాలు చూసుకుని విద్యార్థుల మైండ్ బ్లాంక్ అయింది. ఈసెట్‌–2019 టాప్‌ ర్యాంకర్లు సైతం ఫెయిలయ్యారు.

ఈసీఈ, ఈఈఈ బ్రాంచ్‌ విద్యార్థులకు చివరి సెమిస్టర్‌లో ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఆధారంగా ప్రయోగ విభాగంలో మార్కులు వేయాల్సి ఉంటుంది. వీటిని విద్యార్థి ప్రతిభ ఆధారంగా కాలేజీ యాజమాన్యాలు నిర్దేశిస్తాయి. ఆ మార్కులను కాలేజీ యాజమాన్యమే బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. 

అయితే పలు కాలేజీ యాజమాన్యాలు బోర్డు నిర్దేశించిన తేదీల్లో అప్‌లోడ్‌ చేయలేదు. గడువు పూర్తి కావడంతో అప్‌లోడ్‌ ఆప్షన్‌ను బోర్డు తొలగించింది. దీనిని ఆలస్యంగా గుర్తించిన కాలేజీ యాజమాన్యాలు విషయాన్ని బోర్డుకు వివరించాయి. మార్కులను నిర్దేశిత పద్ధతిలో పంపించాలని కోరింది. 

దాంతో  యాజమాన్యాలు మార్కులను పంపాయి. కానీ ఫలితాల్లో విద్యార్థులకు మార్కులు ఆ మార్కులను చేర్చలేదు. సోమవారం మీర్‌పేట్‌ సమీపంలోని ఓ కాలేజీ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన చేపట్టినప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు బోర్డుకు ఫిర్యాదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios