హుజూరాబాద్, బద్వేల్ ఉపఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు అధికారులు

హుజూరాబాద్, బద్వేల్ అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రెండు అసెంబ్లీ ఉప ఎన్నికలకు ప్రధాన పార్టీలు సర్వశక్తులను ఒడ్డుతున్నాయి.

All Arrangements  set for Huzurabad Assembly constituency In Telangana and Badvel bypoll in AP


హైదరాబాద్: తెలంగాణలో హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్ లోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ సిబ్బంది బయలుదేరారు. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అధికారులు.

అసైన్డ్, దేవాలయభూములు ఆక్రమించుకొన్నారనే ఆరోపణలతో తన మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను కేసీఆర్ భర్తరఫ్ చేశారు.ఈ పరిణామం తర్వాత ఈ ఏడాది జూన్ 12వ తేదీన ఈటల రాజేందర్  హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రెండు రోజులకే ఆయన బీజేపీలో చేరారు. దీంతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది.

also read:https://telugu.asianetnews.com/telangana/police-stops-etela-rajender-vehicle-in-warangal-r1qfxd

రేపు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.  నియోజకవర్గంలో 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఈ పోలింగ్ కేంద్రాల్లో ఐదు వేల పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. 

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2.30 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో 1.19 లక్షల మంది మహిళా ఓటర్లున్నారు.ఈ నియోజకవర్గంలో 14 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారు. 306 పోలింగ్ కేంద్రాల్లో...306 కంట్రోల్ యూనిట్స్‌తో పాటు 612 బ్యాలెట్ యూనిట్స్, 306 వివి ఫ్యాట్స్‌ను ఏర్పాటు చేశారు.

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 30 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. అయితే ప్రధానంగా మూడు పార్టీల మధ్యే పోటీ నెలకొంది. ఈ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్,  బీజేపీ అభ్యర్ధిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్ధిగా బల్మూరి వెంకట్ బరిలో నిలిచారు. 2009నుండి హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. అయితే ఈ దఫా ఆయన బీజేపీ అభ్యర్ధిగా పోటీకి దిగాడు.

బద్వేల్ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి

Kadapa జిల్లాలోని Badvel అసెంబ్లీ నియోజకవర్గంలో 148 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు. 2019 ఎన్నికల్లో ఈ అసెంబ్లీ స్థానం నుండి Ycp అభ్యర్ధిగా పోటీ చేసిన డాక్టర్ Venkata Subbaiah విజయం సాధించారు. ఈ ఏడాది మార్చిలో వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మరణించారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

బద్వేల్ అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ Dasari Sudha ఆ పార్టీ బరిలోకి దింపింది. Bjp అభ్యర్ధిగా Suresh బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ kamalamma పోటీ చేస్తున్నారు. 

ఈ నెల 30వ తేదీన ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు గాను 281 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ పోలింగ్ స్టేషన్లలో 148 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా పోలీస్ అధికారులు గుర్తించారు.

సెంట్రల్ బలగాలతో పాటు రాష్ట్ర పోలీస్ సిబ్బంది సుమారు రెండు వేల మంది పోలీసు సిబ్బందిని పోలింగ్ కోసం వినియోగిస్తున్నారు.ఈ నియోజకవర్గంలో 2.16 లక్షల మంది ఓటర్లున్నారు. బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో గతంతో పోలిస్తే అత్యధిక ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 77.64 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ సమయంలో ఈ నియోజకవర్గంలో 2,04,618 ఓటర్లున్నారు. ఇందులో 1,58,863 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ప్రస్తుతం 2,15,292 మంది ఓటర్లున్నారు.ఇందులో 1,07,915 మంది పురుషులు,1,07,355 మంది మహిళలున్నారు. మరోవైపు 22 మంది ట్రాన్స్‌జెండర్లు కూడా ఉన్నారని ఏపీ అధికారులు ప్రకటించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios