హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. దీనిపై సోమవారం ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఇది వరకు ఉన్న  మద్యం ధరల కంటే అన్ని రకాల అల్కోహల్ బ్రాండ్స్ పైన 20 శాతం ధరలను పెంచింది. ఈ ధరలను వెంటనే అమలులోకి కూడా తీసుకొచ్చింది. అయితే మద్యం ధరలపెంపుతో ప్రభుత్వానికి మరింత ఆదాయం పెరగనుంది.

 also read  PhotoGallery: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించికున్న కేసీఆర్... పునర్నిర్మాణ పనుల పరిశీలన

 ఇక ధరల పెంపుతో ప్రభుత్వానికి ఆదాయం ఎంత పెరుగుతుందంటే గత అక్టోబర్ నెల నుంచి కొత్త ఆబ్కారీ ( ఎక్సైజ్ ) విధానం అమలులోకి వచ్చింది. ఇందులో భాగంగా కేవలం కొత్త టెండర్ల దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ.935 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఇంకా మద్యం ధరలు కూడా పెరిగాయి, దీంతో మరో రూ.4వేల కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వానికి రానుంది.

 మద్యం బ్రాండ్స్, బీరు ధరల పై పెరుగుదల ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అన్ని రకాల బ్రాండ్స్‌లోని క్వార్టర్ బాటిల్ పైన రూ.20, హాఫ్ బాటిల్ పైన రూ.40, ఫుల్ బాటిల్ పైన రూ.80 చొప్పున విదేశీ మద్యం బాటిల్లా పై కూడా రూ.150 ధర పెరిగింది. ఇక ఏదైనా లైట్ బీరుపై ఒక్కటికి రూ.20, స్ట్రాంగ్ బీరుపై ఒక్కటికి రూ.10 పెంచారు.

also read తెలంగాణ స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ యోచనలో కేసీఆర్, సీఎం గా కేటీఆర్?

అప్పుడే కొత్త ఎమ్మార్పీ ధరలను అమలు చేయాలనే ఉద్దేశ్యంతో మద్యం డిపోల నుంచి దుకాణాలకు సరకు సరఫరాను ఆపేశారు.ధరల పెంపుదల నిర్ణయంతో మంగళవారం నుంచి మద్యం సరఫరాను పునరుద్ధరించనున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మద్యన్ని(పాత స్టాక్)  వైన్స్ షాప్ యజమానులు పాత ధరకే అమ్మలని తెలిపింది. కొత్త ఎమ్మార్పీ ధరలు ముద్రించిన మద్యం అందుబాటులోకి వచ్చాకే అప్పుడు కొత్త ధరల  ప్రకారం అమ్మకాలు  చేయాలని తెలిపింది.

 ఏదైనా ఒక లైట్ బీర్‌ మద్యం పరిమాణాన్ని బట్టి దాని ధరను రూ.20 నుంచి రూ.80 వరకు పెంచారు. బీరు ప్రియులు మాత్రం ఒక్కో సీసాపై రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. లైట్ బీర్ ఇష్టపడే వారికి డబుల్ షాక్ ఎందుకంటే ఒక్క బీరు పై రూ.20, అలాగే  స్ట్రాంగ్ బీర్ ఇష్టపడే వారికి ఒక్కో స్ట్రాంగ్ బీరుపై రూ.10 పెరిగింది. మరికొన్ని పాపులర్ బీర్ బ్రాండ్ పై రూ.30 వరకు కూడా ధర పెరిగింది.

 ఇక కింగ్ ఫిషర్ బీరు రూ.120 ధరల పెరుగుదల తర్వాత రూ.100కు దొరికే క్వార్టర్ రూ.120కి పెరుగుతుంది. బ్లాక్ డాగ్, హండ్రెడ్ పైపర్, టీచర్స్ వంటి ఫుల్ బాటిల్ స్కాచ్ రేట్లు రూ.150 వరకు పెరుగుతుంది. ఇప్పటి వరకు రూ.100కు దొరికిన కింగ్ ఫిషర్ లైట్ బీరు ఇక నుంచి రూ.120కి లభ్యమవుతుంది. రూ.120కి దొరికే కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీరు ఇక పై రూ.130 అవుతుంది.

also read దిశ కేసు: ఈ నెల 27న ఛార్జీషీటు దాఖలు చేయనున్న పోలీసులు

 వినోదభరిత కార్యక్రమాల నుంచి కూడా ఆదాయం రాబట్టేందుకు వారు సిద్ధమవుతున్నారు. వివిధ సందర్భాల్లో నిర్వహించుకునే ప్రయివేటు పార్టీలు, ఈవెంట్స్, క్లబ్స్ చేపట్టే వినోద కార్యక్రమాల సందర్భంగా మద్యాన్ని సర్వ్ చేయడంపై భారీగా లైసెన్స్ ఫీజులు వసూల్ చేయనున్నారు. లైసెన్స్ ఫీజు పెంపుకు సంబంధించి ఉత్తర్వుల్ని ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని, జిల్లాల్లోని ప్రతి ఈవెంట్‌కు రూ.9వేల వసూలు చేస్తున్నారు.

దీనిని తాజాగా ఎక్సైజ్ శాఖ రూ.12వేలకు పెంచేసింది. జీహెచ్‌ఎంసీ, పరిసరాల్లోని 5 కి. మీ. పరిధిలోని ఉండే ఫోర్ స్టార్ హోటళ్ అంతకన్నా ఖరీదైన హోటళ్లలో నిర్వహించే ఈవెంట్స్‌కు రూ.12వేలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఇది రూ.20వేలకు పెంచింది. స్పోర్ట్స్, కమర్షియల్, ఇతర వినోద కార్యక్రమాల విషయంలో మాత్రం వాటికి హాజరయ్యే వారి ఆధారంగా రేట్లు ఉంటాయి.