తాగడానికి డబ్బులు ఇవ్వని తండ్రి.. విసుగొచ్చి కొట్టి చంపిన కొడుకు

alcohol Addicted son murder to her father
Highlights

తాగడానికి డబ్బులు ఇవ్వని తండ్రి.. విసుగొచ్చి కొట్టి చంపిన కొడుకు 

తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదని తండ్రిని కొట్టి చంపాడు ఓ తాగుబోతు కొడుకు. నిర్మల్ జిల్లా ముథోల్‌కు చెందిన నగేశ్‌ తండ్రి  పోతన్నతో కలిసి నివసిస్తున్నాడు.. జులాయిగా తిరిగే నగేశ్ మద్యానికి బానిసయ్యాడు.. తరచూ తాగడానికి డబ్బుల కోసం తండ్రిని వేధించేవాడు.

ఈ క్రమంలో ఇవాళ ఉదయం ఇంటికి వచ్చి మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని అడిగాడు.. తండ్రి పొతన్న లేవని సమాధానం చెప్పాడు.. ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగి ఆగ్రహంతో నగేశ్ తండ్రిని అందుబాటులో ఉన్న కర్రనతో విచక్షణారహితంగా కొట్టి పరారయ్యాడు.. వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించి పోతన్నను ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నగేశ్ కోసం గాలిస్తున్నారు.

loader