అకున్ కు మాఫియా బెదిరింపులు. పిల్లలున్నారు జాగ్రత్త అంటు ఫోన్ కాల్స్. రంగలోకి దిగిన ఇంటెలిజెన్స్ అధికారులు.
అచ్చ తెలుగు సినిమాలాగానే జరుగుతుంది. తెలంగాణలో నెల రోజులుగా డగ్స్ గుట్టురట్టవుతుంది. దానికి ప్రధాన కారణం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మేంట్ డీఐజీ అకున్ సబర్వాల్. ఆయన హైదరాబాదులో డ్రగ్స్ లేకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా నగరంలో ఉన్న స్కూల్స్ దగ్గరిని నుండి పబ్‌లు, బార్లు, సినిమా ఇండస్ట్రీని ఎవరని వదిలిపెట్టలేదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టం ముందుకు నిలబెట్టాలని చూస్తున్న అకున్ సబర్వాల్ కు బెదిరింపులు వస్తున్నాయి.
గత 10 రోజులుగా డ్రగ్ మాఫియా అకున్ సబర్వాల్ ను బెదిరిస్తోంది. రోజు అకున్ కి ఫోన్ చేసి నీ అంతు చూస్తామని బెదిరించే డ్రగ్ మాఫియా. ఎవరు అకున్ బెదరడం లేదని మాఫియా ముఠా రూట్ మార్చింది. నిన్నటి నుంచి అకున్‌కి కొందరు ఫోన్ చేసి నీ పిల్లలు ఏ స్కూల్ లో చదువుతారో తెలుసు, ఏ వాహనాల్లో, ఎప్పుడు? ఎక్కడికి? వెళ్తారో కూడా తెలుసు... అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.
అయితే ఆయనకు వచ్చే బెదిరింపు ఫోన్ కాల్స్ పైన నిఘా ఉంచిన ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకి దిగింది. అకున్ సబర్వాల్ కు వస్తున్న ఫోన్ కాల్స్ పై దర్యాప్తు చేపట్టింది. అయితే ఇప్పటి వరకు అకున్ సబర్వాల్ వచ్చిన కాల్స్ అన్ని ఇంటర్నేట్ నుండి వచ్చిన కాల్స్ అని తెలుస్తుంది. కాల్స్ సంబందిత వివరాలు ఇంటెలిజెన్స్ విభాగం టెక్నికల్ టీం పంపారు. పలు దేశాల ఐపీ అడ్రస్ లను నుండి కాల్స్ వచ్చాయని తెలుస్తుంది.
