Asianet News TeluguAsianet News Telugu

నెలరోజులుగా అఖిలేష్ టచ్ లో ఉన్నాడు : కేసిఆర్

జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోశిస్తా

Akhilesh is in touch with me: KCR

తెలంగాణ సిఎం కేసిఆర్, యుపి మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ జాయింట్ ప్రెస్ మీట్ ప్రగతి భవన్ లో జరిగింది. మీడియా సమావేశంలో ఇద్దరు నేతలు పలు కీలకమైన అంశాలను వెల్లడించారు. అంతకుముందు వారిద్దరి మధ్య సుదీర్ఘ భేటీ జరిగింది. బేగంపేట విమానాశ్రయంలో దిగిన అఖిలేష్ కు ఐటి మంత్రి కేటిఆర్, సినిమా మంత్రి తలసాని శ్రీనివాస్ స్వాగతం పలికారు. అక్కడినుంచి ప్రగతిభవన్ చేరుకున్న అఖిలేష్ కేసిఆర్ తో సమావేశమయ్యారు. ప్రగతి భవన్ లో అఖిలేష్ కు కేసిఆర్ విందు ఇచ్చారు.

మీడియా సమావేశంలో కేసిఆర్ మాట్లాడుతూ గత నెలరోజులుగా అఖిలేష్ యాదవ్ తో ఫోన్లలో టచ్ లో ఉన్నట్లు చెప్పారు.  దేశ రాజకీయ వ్యవస్థ, సుపరిపాలన అంశాలపై చర్చించినట్లు చెప్పారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏ వర్గం వారూ సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోశిస్తానని కేసిఆర్ అన్నారు. అఖిలేష్ తో ప్రాథమిక చర్చలు మాత్రమే జరిగాయన్నారు. దేశంలో ఒక పరివర్తన తీసుకొచ్చేందుకు, గుణాత్మక మార్పు కోసం జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోశిస్తానని చెబుతూ వచ్చానన్నారు. తాను చేసేది చిన్న ప్రయత్నం అనుకొని, చిల్లరమల్లర ప్రయత్నం అనుకుని కొందరు ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల కోసం చేస్తున్న ప్రతయ్నంగా  భావిస్తున్నారని అన్నారు. భారత రాజకీయాల్లో గుణాత్మక మార్పు పై అఖిలేష్ తో చర్చించాను. 70 ఏళ్లుగా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు.

సమావేశంలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ కేసిఆర్ తో అనేక అంశాలపై చర్చించామన్నారు. కేసిఆర్ ఆలోచనా విధానం నచ్చిందన్నారు. దేశంలో బిజెపి పరిపాలన అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించారు. ప్రజలు మంచి మార్పు కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. రైతులు ఎప్పుటివరకు  అయితే సంతోషంగా ఉండరో అప్పటి వరకు మార్పు సాధ్యం కాదని చెప్పారు. రైతులు బిజెపి పాలనలో నిరాశతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఆరోపించారు. ప్రతి రాష్ట్రంలో బిజెపి ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. తెలంగాణ సిఎం కేసిఆర్ తో మళ్లీ కలుస్తాను. కేసిఆర్ ప్రయత్నాన్ని సమాజ్ వాదీ పార్టీ అభినందిస్తుందన్నారు. యుపిలో రెండు ఎంపి సీట్లు బిజెపి కోల్పోయిందన్నారు. సిఎం, డిప్యూటీ సిఎం స్థానాల్లో బిజెపి ఓటమిపాలైందన్నారు. కొత్త ప్రత్యామ్నాయం ఈ దేశానికి అవసరం అన్నారు. నోట్ల రద్దుతో దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని బిజెపి చెప్పింది. కానీ ఆచరణలో ఏం జరిగిందో తెలుసు కదా అని ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios