హైదరాబాద్ మేయర్ కు అఖిలేష్ ఫ్యాన్స్ ఝలక్ (వీడియో)

First Published 3, May 2018, 2:33 PM IST
Akhilesh fans angry at Telangana police
Highlights

ఎలా నిలదీశారో చూడండి

యుపి మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ తెలంగాణ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరుపై అఖిలేష్ ఫ్యాన్స్, సమాజ్ వాదీ పార్టీ తెలంగాణ నేతలు గుర్రుగా ఉన్నారు. పోలీసుల మీద ఉన్న కోపం హైదరాబద్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తోపాటు తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ సర్వీస్ కార్పొరేషన్ ఛైర్మన్ చిరుమల్ల రాకేష్ మీద చూపించారు.

"

బేగంపేట ఎయిర్ పోర్టులో అఖిలేష్ యాదవ్ కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అఖిలేష్ అబిమానులు, తెలంగాణ సమాజ్ వాదీ పార్టీ నేతలు వచ్చారు. వారంతా మండుటెండలో అఖిలేష్ కు స్వాగతం పలికేందుకు ఎదురుచూశారు. కానీ పోలీసులు వారిని అనుమతించలేదు. కేవలం టిఆర్ఎస్ నేతలను మాత్రమే అనుమతించారు. దీంతో వారు ఆగ్రహంతో ఊగిపోయారు.  

ఇక సాయంత్రం మంత్రి తలసాని శ్రీనివాస్ ఇంటికి అఖిలేష్ యాదవ్ పర్యటన నేపథ్యంలో అక్కడికి పెద్ద సంఖ్యలో అఖిలేష్ అభిమానులు, ఎస్పీ నేతలు చేరుకున్నారు. అక్కడే ఉన్న హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, చిరుమల్ల రాకేష్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్పీ నేతలు. పోలీసుల పై కూడా ఫైర్ అయ్యారు. తమను అవమానించారని సీరియస్ అయ్యారు. వీడియో పైన ఉంది.

loader