Asianet News TeluguAsianet News Telugu

ఏకే రావుది ఆత్మహత్యే: తేల్చిన బెంగుళూరు పోలీసులు

ప్రముఖ సింగర్ హరిణి తండ్రి ఏకే రావు  ఆత్మహత్య చేసుకొన్నట్టుగా బెంగుళూరు పోలీసులు తేల్చారు. సుజనా పౌండేషన్ సీఈఓగా కూడా ఏకే రావు పనిచేస్తున్నారు.

AK Rao Commits Suicide Says  Banglore Police
Author
Hyderabad, First Published Dec 1, 2021, 4:45 PM IST

హైదరాబాద్: ప్రముఖ సింగర్ హరిణి తండ్రి ఏకే రావు ఆత్మహత్య చేసుకొన్నట్టుగా బెంగుళూరు పోలీసులు గుర్తించారు. Sujana foundation,సీఈఓగా కూడా ఏకే రావు పనిచేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 25న ఏకే రావు అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం వెలుగు చూసింది.నవంబర్ 22న  Bangloreలోని రైల్వే ట్రాక్ పై ఏకే రావు మృతదేహం లభ్యమైంది. బెంగుళూరులోని తన కొడుకు నివాసానికి వెళ్లిన Ak Rao అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే మృతదేహంపై ఉన్న గాయాల ఆధారంగా  ఏకే రావు మరణించినట్టుగా పోలీసులు అనుమానించారు. ఏకే రావును హత్య చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే పోస్టు మార్టం రిపోర్టు ఆధారంగా  ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు.   నవంబర్ 8వ తేదీన ఏకే రావు  బెంగుళూరుకు వెళ్లాడు. కొడుకు ఇంట్లోనే ఆయన ఉన్నాడు. 

అయితే  ఏకే రావు మృతికి సంబంధించిన సమాచారం కుటుంబ సభ్యులకు ఇచ్చారు బెంగుళూరు పోలీసులు. బెంగుళూరులోనే ఉన్న కొడుకు రైల్వే ట్రాక్ పై ఉన్న డెడ్ బాడీ తన తండ్రిదేనని నిర్ధారించారు.ఒంటిపై వున్న గాయాలను చూసి ఏకే రావును వేరే ప్రాంతంలో హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బెంగళూరు రూరల్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో 174 సీఆర్‌పీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. చివరకు ఏకే రావుది ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు.  రైల్వే ట్రాక్ పై పడడంతో శరీరంపై గాయాలైనట్టుగా పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. 

also read:సింగర్ హరిణి తండ్రి హత్య కేసు.. ఆ ఒంటిపై గాయాలన్నీ.. ఆయన చేసుకున్నవేనా..?

అయితే ఏకే రావు ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటనే విషయమై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏకే రావు మృతి చెందిన సమయంలో కుటుంబసభ్యులు కొందరిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆర్ధిక లావాదేవీల అంశానికి సంబంధించిందని కూడా కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. తొలుత ఏకే రావు మృతిపై తమకు ఎలాంటి సమాచారం లేదని హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ గత నెల 22న ప్రకటించారు. ఈ విషయమై తమకు ఎవరి నుండి సమాచారం కానీ,ఫిర్యాదు కానీ రాలేదన్నారు. ఈ విషయమై బెంగుళూరు పోలీసుల నుండి సమాచారం తీసుకొని దర్యాప్తు చేస్తామని ఆయన ప్రకటించారు

.రూ. 150 కోట్ల డీల్ వ్యవహరానికి సంబంధించి గిరీ్ మధ్యవర్తిత్వంపై కూడా పోలీసులు ఆరా తీసినట్టుగా సమాచారం. ఏకే రావు సెల్ ఫోన్ డేటా  ఆధారంగా కూడా పోీసులు విచారణ నిర్వహించారు. తొలుత  నాందేడ్ ఎక్స్‌ప్రెస్ కో పైలట్  ఏకే రావు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. అతని తల ఎడమవైపున ఆరు సెంటిమీటర్ల పొడవైన గాయం వున్నట్లుగా గుర్తించారు. అయితే రైల్వే ట్రాక్ పై పడడం వల్లే ఈ గాయాలు అయ్యాయని పోస్టుమార్టం నివేదిక వెల్లడించిందని సమాచారం. అయితే ఏకే రావు ఆత్మహత్య చేసుకొనే పరిస్థితులు ఏమున్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఏకే రావు శరీరంపై ఉన్న గాయాలు కూడా ఆయన చేసుకొన్నట్టుగానే ఫోరెన్సిక్ నివేదిక  తెలిపిందని సమాచారం. 
 


 

Follow Us:
Download App:
  • android
  • ios