హైదరాబాద్:  ఎయిర్ ఏషియా ఎ-320 విమానానికి శంషాబాద్ ఎయిర్  పోర్టులో  మంగళవారం నాడు తృటిలో ప్రమాదం తప్పింది. పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణీకులు  సురక్షితంగా బయటపడ్డారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఏషియా ఎ-320  విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. జైపూర్ నుండి హైద్రాబాద్ వస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఇంజన్ లో ప్యూయల్ లీక్ ను గుర్తించిన పైలెట్ ప్రయాణీకులను గుర్తించారు.  వెంటనే శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు.విమానంలో 76 మంది ప్రయాణీకులు ఉన్నారు. 

also read:విమానాల్లో మధ్య సీటును ఖాళీగా ఉంచాలి: సుప్రీంకోర్టు ఆదేశం

ఒకే ఇంజిన్ తో విమానాన్ని పైలెట్ ల్యాండింగ్ చేశాడు. మరో రెండు గంటల్లో ప్రయాణీకులను ఛండీఘడ్ పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.లాక్‌డౌన్ ఆంక్షల సడలింపులో భాగంగా ఈ నెల 25వ తేదీ నుండి దేశీయ విమానాల రాకపోకలను కేంద్రం అనుమతి ఇచ్చింది. విమానాల రాకపోకలు ప్రారంభమైన తర్వాత దేశంలో పలు విమానాశ్రాయల నుండి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. అయితే చివరిక్షణంలో విమానాలు రద్దు కావడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు.