AIMIM: మూడు లోక్‌సభ స్థానాల నుంచి ఎంఐఎం పోటీ.. హైదరాబాద్ సీటుపై మూడు పార్టీల మధ్య పోటీ
హైదరాబాద్ పార్లమెంటరీ స్థానంలో ముక్కోణపు పోటీ నెలకొనబోతున్నది. ఈ స్థానానికి ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ ఫోకస్ పెంచనుంది. అలాగే.. ఎంబీటీ అభ్యర్థి కూడా బరిలో నిలబడనున్నారు.
Hyderabad: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ మూడు స్థానాల నుంచి పోటీ చేయనుంది. హైదరాబాద్‌తోపాటు ఔరంగాబాద్, కిషన్‌గంజ్ పార్లమెంటరీ స్థానాల్లో తమ పార్టీ బరిలో ఉంటుందని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.
హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని బహదూర్ పూర్త అసెంబ్లీ సెగ్మెంట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. ‘వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమ ముగ్గురు అభ్యర్థులను ఓటర్లు ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను. తద్వార లోక్ సభలో ముస్లిం గళాన్ని బలోపేతం చేస్తారని అనుకుంటున్నాను. ఎంఐఎం పార్టీ అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇస్తారని, వారికి అండగా నిలబడతారని ఆశిస్తున్నాను’ అని అసదుద్దీన్ అన్ారు.
ముఖ్యంగా హైదరాబాద ప్రజలు ప్రత్యర్థుల కుట్రలు, కుయుక్తలను పసిగట్టాలని, వారి ట్రాప్‌లో పడొద్దని ఒవైసీ సూచించారు. ప్రత్యర్థుల విచ్ఛిన్నకర శక్తులను ఐక్యంగా ఎదుర్కొని ఓడించాలని పిలుపు ఇచ్చారు. ఈ కఠిన పరిస్థితుల్లో ప్రత్యర్థుల విభజన విధానాలను ఎదుర్కోవాలని పేర్కొన్నారు.
Also Read: PM Modi: కరెంట్ బిల్లు జీరో చేయడానికి కేంద్రం అడుగులు: ప్రధాని మోడీ
హైదరాబాద్ ఎంపీగా అసదుద్దీన్ ఒవైసీనే ఉన్నారు. ముస్లిం మెజార్టీ ఉన్న ఈ సీటు చాలా సార్లు అసదుద్దీన్ ఒవైసీకే దక్కింది. అయితే, ఈ సారి హైదరాబాద్ ఎంపీ సీటుపైనా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని బీజేపీ భావిస్తున్నది. నామమాత్రపు పోటీ కాదు.. హైదరాబాద్ సీటు గెలుచుకునేలా పని చేయాలని ఇటీవలే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపు ఇచ్చారు.
బీజేపీతోపాటు ఎంబీటీ స్పోక్స్‌పర్సన్ అంజదుల్లా కూడా హైదరాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. దీంతో హైదరాబాద్ స్థానంలో ముక్కోణపు పోటీ నెలకొనబోతున్నది.