హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను కృష్ణార్జునులంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. 

ఆర్టికల్ 370 రద్దు విషయంలో మోదీ, అమిత్ షాలు కృష్ణార్జునుల్లా వ్యవహరించారని రజనీకాంత్ ప్రశంసించారు. వారిద్దరూ కృష్ణార్జునులు అయితే పాండవులు, కౌరవులు ఎవరు అంటూ ప్రశ్నించారు. దేశంలో మరో మహాభారతం కావాలని మీరు అనుకుంటున్నారా?’ అంటూ విమర్శల దాడి చేశారు. 

‘లిజనింగ్‌..లెర్నింగ్‌..లీడింగ్‌’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్  మిషన్‌ కశ్మీర్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. పార్లమెంటులో అమిత్‌షా ప్రసంగం అద్భుతం. అమిత్‌ షా- మోదీ ఇద్దరూ కృష్ణార్జున కాంబినేషన్‌లాంటి వారు. ఎవరెలాంటి వారో వారికి మాత్రమే తెలుసు. మీకంతా శుభాలే కలగాలి’ అని అన్నారు. 

అంతేకాదు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపైనా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు రజనీకాంత్. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎప్పుడూ ప్రజా సంక్షేమం కోసమే ఆలోచిస్తుంటారు. ఆయనో గొప్ప ఆధ్యాత్మిక వేత్త అంటూ చెప్పుకొచ్చారు. 

ఇప్పటికే రజనీకాంత్ వ్యాఖ్యలపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రజనీకాంత్ వ్యాఖ్యలు చూస్తుంటే మహాభారతాన్ని మరోసారి చదువుకోవాలంటూ చురకలు వేసింది. తాజాగా అసదుద్దీన్ ఓవైసీపీ విమర్శలు చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశారు: వెంకయ్యపై రజిని సంచలన వ్యాఖ్యలు