తనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడంపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. రెచ్చగొట్టే ప్రసంగాలకు మోడీ రివార్డులు ఇచ్చారంటూ ఆయన చురకలు వేశారు. హేట్ ప్రసంగాలు , విమర్శించడం ఒకటి కాదని ఒవైసీ వెల్లడించారు.
తనపై ఢిల్లీ పోలీసులు (Delhi police) ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇలాంటి కేసులు ఎక్కడా చూడలేదని.. రెచ్చగొట్టే ప్రసంగాలకు మోడీ రివార్డులు ఇచ్చారంటూ చురకలు వేశారు. తనను చంపేందుకు ప్రయత్నం చేశారని... వారంతా హిందుత్వ నేతలయ్యారని ఒవైసీ దుయ్యబట్టారు. దీనికి ముగింపు పలకాలని.. తాను న్యాయవాదులను సంప్రదిస్తానని అసదుద్దీన్ స్పష్టం చేశారు. హేట్ ప్రసంగాలు , విమర్శించడం సమానం కాదని ఒవైసీ అన్నారు.
కాగా.. రెచ్చగొట్టే ప్రకటనలకు చేశారంటూ.. ఢిల్లీ పోలీసులు గురువారం నాడు ఒవైసీపై కేసు నమోదు చేశారు. ద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, వివిధ సమూహాలను రెచ్చగొట్టడం, ప్రజల ప్రశాంతతకు హాని కలిగించడం, సామాజిక మాధ్యమాల్లో అసత్యం, తప్పుడు సమాచారం చేయడం వంటి ఆరోపణలపై ఒవైసీ (Asaduddin Owaisi) పాటు, పలువురిపై ఢిల్లీ పోలీసులు IFSSO ఎఫ్ఐఆర్ యూనిట్ కేసు బుక్ చేసింది. అదే సమయంలో దాస్నా దేవి ఆలయ పూజారి యతి నర్సింహానంద్‌పై కూడా ఎఫ్‌ఐఆర్‌లు నమోదైంది. మతపరమైన వివాదాస్పద చేసిన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మపై సస్పెన్షన్ వేటు పడిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
Also Read : Asaduddin Owaisi: AIMIM చీఫ్ పై ఢిల్లీ పోలీసులు సీరియస్.. FIR నమోదు
ఇదిలావుండగా, మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మ.. తనకు హత్య బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు చేయడంతో ఆమెకు భద్రత కల్పించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మైనారిటీలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆదివారం సస్పెండ్ చేసింది. శర్మను సస్పెండ్ చేస్తూ.. బిజెపి "అన్ని మతాలను గౌరవిస్తుంది" "ఏదైనా శాఖ లేదా మతాన్ని అవమానించే లేదా కించపరిచే ఏ భావజాలానికి తాము వ్యతిరేకం" అని పేర్కొంది. బీజేపీ నాయకురాలు వ్యాఖ్యలను గల్ఫ్ దేశాల తీవ్ర వ్యతిరేఖిస్తున్నాయి. మైనారిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు భారత్ ప్రకటించింది.
అంతకుముందు రోజు.. AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. నుపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నూపుర్ శర్మ వ్యాఖ్యలు క్షమించలేనివనీ, తన ప్రకటనలో ఇంగ్లీషులో 'ఇఫ్' అని రాసిందని ఆయన అన్నారు. బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్ల రాజకీయాలు చేస్తుందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఏదైనా జరిగినప్పుడు.. అది బుల్‌డోజర్‌లను నడుపుతుంది, కాబట్టి ఇప్పుడు నుపుర్ శర్మ ఇంట్లో బుల్‌డోజర్ నడుస్తుందా? దేశంలోని ముస్లింల విషయానికి వస్తే ప్రధాని మోదీ తమ మాట వినడం లేదన్నారు. ప్రధానికి భారతీయ ముస్లింల బాధలు అర్థం కావడం లేదనీ, దేశంలోని ముస్లింలను బీజేపీ కించపరిచిందని ఆరోపించారు.
