హిజాబ్‌పై పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ చేసిన వ్యాఖ్యలకు ఎంఐఎం (aimim) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (asaduddin owaisi) కౌంటరిచ్చారు. బాలికల విద్యపై మీరు మాకు పాఠాలు చెప్పనక్కర్లేదన్నారు. మలాలాను (malala yousafzai) పాకిస్తాన్‌లోనే ఎటాక్ చేశారని.. మహిళలకు హిజాబ్ రాజ్యాంగం కల్పించిన హక్కు అని అసదుద్దీన్ గుర్తుచేశారు.
హిజాబ్‌పై పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం (aimim) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (asaduddin owaisi) స్పందించారు. హిజబ్ తమ సమస్య అని.. తామే పరిష్కరించుకుంటామని అసద్ కౌంటరిచ్చారు. బాలికల విద్యపై మీరు మాకు పాఠాలు చెప్పనక్కర్లేదన్నారు. మలాలాను (malala yousafzai) పాకిస్తాన్‌లోనే ఎటాక్ చేశారని.. మహిళలకు హిజాబ్ రాజ్యాంగం కల్పించిన హక్కు అని అసదుద్దీన్ గుర్తుచేశారు. ఆ హక్కు కోసమే తాము పోరాటం చేస్తున్నామని.. హిజాబ్ కోసం పోరాడే వారికి తాము సంపూర్ణ మద్ధతు తెలియజేస్తున్నట్లు ఒవైసీ పేర్కొన్నారు. హిజాబ్‌కు వ్యతిరేకంగా కర్ణాటక సర్కార్ నోటిఫికేషన్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ (shah mohammad qureshi) ట్విట్టర్ వేదికగా హిజాబ్ వివాదంపై తీవ్రంగా స్పందించారు. హిజాబ్ ధరించిన కారణంగా మహిళలను విద్య నుంచి దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది మానవహక్కులను హరించడమే అవుతుందని ఆయన ఖురేషీ వ్యాఖ్యానించారు. హిజాబ్ ధరించిన వారిని భయభ్రాంతులకు గురి చేయడం అంటే అణచివేయడమేనని.. ఇలా చేయడం ద్వారా ముస్లింలను గుప్పిట్లో పెట్టుకోవాలని భారత ప్రభుత్వం చూస్తోందంటూ మహ్మద్ ఖురేషీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే అసదుద్దీన్ కౌంటరిచ్చారు.
కాగా.. Hijab విషయమై దాఖలైన పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి Karnataka Single Judge రిఫర్ చేసింది. అయితే ఈ విషయమై విస్తృత ధర్మాసనం అవసరమని భావిస్తున్నామని జడ్జి క్రిషన్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. అయితే గతంలో ఇదే తరహాలో Madras, Keralaహైకోర్టుల్లో తీర్పును సింగిల్ జడ్జి లే ఇచ్చారని న్యాయవాది కాళీశ్వరం రాజ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులను కూడా విస్తృత బెంచే ఇస్తుందని సింగిల్ జడ్జి అభిప్రాయపడ్డారు.
Bangaloreలో రెండు వారాల పాటు నిరసనలపై ఆంక్షలు విధించారు. హిజాబ్ పై వరుస పిటిషన్లను తప్పుగా భావించబడుతున్నాయని అడ్వకేట్ జనరల్ ఈ పిటిషన్ పై విచారణ సందర్శంగా చెప్పారు. అయితే పిల్లలను వారి విశ్వాసాలను అనుసరించి స్కూల్స్ కు వెళ్లనివ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. అయితే ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడాన్ని పిటిషనర్ వ్యతిరేకించారు. ఈ విషయమై వెంటనే పరిష్కారం కావాలని పిటిషనర్ కోరుకొన్నాడు.
మరోవైపు విద్యార్ధులు హిజాబ్ ధరించి కాలేజీలకు వెళ్లేందుకు వీలుగా మధ్యంతర ఉపశమనం మంజూరు చేయడాన్ని అడ్వకేట్ జనరల్ వ్యతిరేకించారు. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు పిటిషన్ ను అనుమతించవద్దని అడ్వకేట్ జనరల్ చెప్పారు.ప్రభుత్వ గెజిటెడ్ ఆర్డర్ ను ప్రశ్నించినందున పిటిషనర్ల అభ్యర్ధనలు తప్పుగా భావించబడ్డాయని అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాదీ చెప్పారు. ప్రతి సంస్థకు స్వయంప్రతిపత్తి ఇచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. కాలేజీ లేదా విద్యా సంస్థలు నిర్ధేశించిన డ్రెస్ కోడ్ కు కట్టుబడి పిల్లలు తప్పనిసరిగా స్కూల్ కు హాజరు కావాలని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు.
మరోవైపు శివమొగ్గలో 144 సెక్షన్ ను విధించారు. హిజాబ్ వివాదం నేపథ్యంలో రాష్ట్రంలో విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.గతనెలలోUdupiలోని ప్రభుత్వ college లో ఈ వివాదం ప్రారంభమైంది. ఆరుగురు విద్యార్థినీలు నిర్దేశించిన దుస్తుల కోడ్‌ను ఉల్లంఘించి Hijabలు ధరించి తరగతులకు వచ్చారు. తర్వాత నగరంలోని మరికొన్ని కళాశాలల్లో సమీపంలోని కుందాపూర్, బిందూర్‌లలో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. ఈ ఆంశానికి వ్యతిరేకంగా ఓ వర్గం విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి కళాశాలకు ప్రవేశించారు. తాము కండువా ధరించి వస్తామనీ తెలిపారు. కానీ వ్యతిరేకించడంతో తమను తరగతుల నుండి నిషేధించారని ఆరోపించడంతో నిరసనలు ప్రారంభించారు. ఉడిపి, చిక్ మంగళూరులోని రైట్‌వింగ్ గ్రూపులు ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకించాయి. ఈ నిరసనలు ఉడిపిలో ఉన్న మరిన్ని కళాశాలలకు వ్యాపించాయి.
