Asianet News TeluguAsianet News Telugu

238 ఇంజనీరింగ్ కాలేజీలకు ఎఐసీటీఈ నోటీసులు

తెలంగాణలోని 238 ఇంజనీరింగ్ కాలేజీలకు ఎఐసీటీఈ శుక్రవారం నాడు నోటీసులు  జారీ చేసింది. 

AICTE Issues Notice To 238 Engineering colleges in Telangana
Author
Hyderabad, First Published Dec 13, 2019, 5:32 PM IST

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలోని 238 ఇంజనీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ నోటీసులు జారీ చేసింది. దీంతో 2020 విద్యా సంవత్సరంపై ఈ ఇంజనీరింగ్ కాలేజీలో భవితవ్యం అయోమయంలో పడింది.

రాష్ట్రంలోని 238 ఇంజనీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ 19 అంశాలపై నోటీసులు ఇచ్చింది. 19 అంశాలు ఆయా కాలేజీల్లో సరైన సదుపాయాలు లేవని తేల్చేసింది. ఈ అంశాలపై నిబంధనల ప్రకారంగా ఉంటే ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి ఇస్తామని 2018లోనే ఏఐసీటీఈ స్పష్టం చేసింది.

19 అంశాలను సరిచేసుకొంటేనే అనుమతులను ఇస్తామని ఏఐసీటీఈ తేల్చి చెప్పింది. అయితే తక్కువ కాల వ్యవధిలో కాలేజీల్లో సౌకర్యాలు కల్పించడం సాధ్యం కాదని కాలేజీ యాజమాన్యాలు అభిప్రాయపడ్డాయి. 

ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం ఆ సమయంలో జోక్యం చేసుకొంది. ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వల్ల  రెండేళ్ల పాటు ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతిని ఏఐసీటీఈ అనుమతులు ఇచ్చింది.

దీంతో 2018-19, 2019-20 విద్యాసంవత్సరానికి  ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులను ఇచ్చింది. ఈ గడువు తీరిపోయింది. దీంతో మరోసారి ఏఐసీటీఈ ఇంజనీరింగ్ కాలేజీలకు మరోసారి నోటీసులు జారీ చేసింది.

అయితే తమకు మరింత గడువు ఇవ్వాలని ఏఐసీటీఈ ను ఇంజనీరింగ్  కాలేజీల యాజమాన్యాలు కోరాయి. కానీ, ఈ విషయమై ఏఐసీటీఈ సానుకూలంగా స్పందించలేదు. దీంతో  మరోసారి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరాలని  ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు కోరాలని భావిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios