ఈ నెల 21 తర్వాత కాంగ్రెస్‌లోకి: జూపల్లితో సంపత్ భేటీ
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఎఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఇవాళ భేటీ అయ్యారు.
హైదరాబాద్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఎఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ భేటీ అయ్యారు.కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావు చేరనున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావుతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరనున్నారు. ఈ నెల 21వ తేదీ తర్వాత జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు చేరే అవకాశం ఉంది.
ఈ ఏడాది ఏప్రిల్ 10న బీఆర్ఎస్ నాయకత్వం జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు వేసింది.
ఈ ఇద్దరిని తమ పార్టీల్లో చేర్చుకొనేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు చేశాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఈ ఇద్దరు మొగ్గు చూపుతున్నారు. గత వారంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఇవాళ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ అయ్యారు. అదే సమయంలో టీజేఏసీ చైర్మెన్ కోదండరామ్ కూడ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ లో జూపల్లి కృష్ణారావు చేరిక విషయమై సంపత్ కుమార్ చర్చించినట్టుగా సమాచారం.
also read:కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించా: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ముగిసిన జూపల్లి భేటీ
20014 ఎన్నికలకు ముందు జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎష్ లో చేరారు. 2014లో కేసీఆర్ కేబినెట్ లో జూపల్లి కృష్ణారావుకు మంత్రి పదవి దక్కింది. 2018లో కొల్లాపూర్ నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి జూపల్లి కృష్ణారావు ఓటమి పాలయ్యాడు. జూపల్లి కృష్ణారావుపై విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్ధి బీరం హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. దీంతో బీఆర్ఎస్ లో ఇరువర్గాలకు మధ్య పొసగడం లేదు. ఇరువర్గాలకు మధ్య సయోధ్య కోసం బీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నాలు చేసింది. కానీ ఈ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.