తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య సమన్వయ లోపాలు చోటు చేసుకొన్నాయని ఎఐసీసీ సెక్రటరీ బోస్ రాజు చెప్పారు.తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన సీనియర్లు సమావేశం నిర్వహించడంపై ఆయన స్పందించారు.
హైదరాబాద్: సమన్వయ లోపాలు, సమాచార లోపాలు తప్ప తెలంగాణ కాంగ్రెస్ లో సమస్యలు లేవని ఎఐసీసీ సెక్రటరీ Bose Raju చెప్పారు.తెలంగాణ కు చెందిన కాంగ్రెస్ సీనియర్లు సమావేశం కావడంపై ఆదివారం నాడు బోస్ రాజు స్పందించారు.
ఈ సమావేశానికి సంబంధించిఅందరితో మాట్లాడుతున్నానని ఆయన చెప్పారు. అంతా పరిష్కారం అవుతుందని ఆయన చెప్పారు.పార్టీని నష్టపర్చే ఉద్దేశ్యం ఏ ఒక్క నాయకుడికి లేదిని బోస్ రాజు చెప్పారు. నాయకులంతా Congress పార్టీ గెలుపు కోసమే ఆకాంక్షిస్తున్నారన్నారు. Membership నమోదులో తెలంగాణ కాంగ్రెస్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ నిలిచిందని చెప్పారు.
ఇవాళ సీనియర్లు సమావేశం నిర్వహించవద్దని కూడా బోస్ రాజు సూచించారు. మర్రి శశిధర్ రెడ్డి, వి. హనుమంతరావులకు కూడా ఈ విషయమై బోస్ రాజు ఫోన్ లో మాట్లాడారని సమాచారం. అయితే పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలను చర్చించి రాహుల్ గాంధీకి, సోనియాలకు నివేదిక ఇవ్వాలని సీనియర్లు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి , ఠాగూర్ వంటి నేతలు వ్యవహరిస్తున్న తీరును కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర ఇంచార్జీ ఠాగూర్, ఎఐసీసీ సెక్రటరీలతో పాటు రేవంత్ రెడ్డి తీరుపై కూడా సీనియర్లు రాహుల్, సోనియాలకు వివరించాలని భావిస్తున్నారు. ఈ నెల 21 తర్వాత వీ. హనుమంతరావు ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ అగ్రనాయకత్వానికి రాష్ట్ర పరిస్థితిపై వివరించనున్నారు.
పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీగా ఉన్న మాణికం ఠాగూర్ రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై స్పందించకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోకపోగా పార్టీలో మొదటి నుండి ఉన్న వారికి ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం వాదిస్తుంది. ఈ విషయాలపై సీనియర్లు కొంత కాలంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేవంత్ తీరుకు వ్యతిరేకంగా పార్టీ నాయకత్వానికి సమాచారం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇవాళ హైద్రాబాద్ లో సీనియర్లు సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నారు.
టీడీపీ నుండి పార్టీలో చేరిన వారికే రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వైరి వర్గం ఆరోపిస్తుంది.. మరో వైపు ఈ వాదనలను రేవంత్ రెడ్డి వర్గం తోసిపుచ్చుతుంది,. తమపై ప్రత్యర్ధి వర్గం తప్పుడు ఆరోపణలు చేస్తోందని రేవంత్ రెడ్డి వర్గం చెబుతుంది.తనకు గిట్టని వారిపై తప్పుడు ప్రచారం చేయడానికి సోషల్ మీడియాను రేవంత్ రెడ్డి వర్గం వాడుకుంంటుందని వైరి వర్గం చెబుతుంది.ఈ మేరకు జగ్గారెడ్డిపై సోషల్ మీడియాలో జరిగిన తప్పుడు ప్రచారం గురించి పార్టీ సీనియర్లు ప్రస్తావిస్తున్నారు.
గతంలో పొన్నాల లక్ష్మయ్య నివాసంలో సీనియర్లు సమావేశమయ్యారు. ఆ తర్వాత మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో సీనియర్లు చర్చించారు. ఇవాళ మూడో సమావేశం జరపాలని నిర్ణయం తీసుకొన్నారు. పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై సోనియా, రాహుల్ గాంధీలకు నివేదిక ఇవ్వాలని కూడా సీనియర్లు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డికి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించిన తర్వాత సీనియర్లు ఆయన వ్యవహరశైలిపై మండిపడ్డారు.
ఏకపక్షంగా రేవంత్ రెడ్డి కార్యక్రమాలు చేస్తున్నారని సీనియర్లు అభిప్రాయంతో ఉన్నారు. ఈ విషయమై పలుమార్లు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
