ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఖర్గే నేరుగా చేవేళ్లలోని కాంగ్రెస్ సభకు హాజరుకానున్నారు

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఖర్గే నేరుగా చేవేళ్లలోని కాంగ్రెస్ సభకు హాజరుకానున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు డిక్లరేషన్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ చేవేళ వేదికగా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ ప్రకటించనుంది. 

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే యూత్ డిక్లరేషన్, వ్యవసాయ డిక్లరేషన్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చేవేళ్ల వేదికగా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను ప్రకటించనుంది. దళితులకు భూపంపిణీ చేసే అంశాన్ని ఇందులో ప్రధానంగా ప్రస్తావించనుంది కాంగ్రెస్ . గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయించింది. అలాగే గిరిజనులు, ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములపైనా హక్కులు కల్పించాలని టీ.కాంగ్రెస్ భావిస్తోంది.