ట్విస్ట్: అఫైర్ వల్ల తండ్రిని, అతని ప్రేయసిని తగులబెట్టిన యువకుడు

Affair leades to the death of three
Highlights

వరంగల్ జిల్లా కంఠాత్మకూర్ గ్రామంలో జరిగిన సంఘటన మలుపు తిరిగింది. సిలిండర్ పేలి మంటలు అంటుకోవడంతో ముగ్గురు సజీవ దహమైనట్లు భావించిన సంఘటన మరో మలుపు తిరిగింది. ఆ సంఘటనను హత్యగా పోలీసులు గుర్తించారు. 

వరంగల్:  వరంగల్ జిల్లా కంఠాత్మకూర్ గ్రామంలో జరిగిన సంఘటన మలుపు తిరిగింది. సిలిండర్ పేలి మంటలు అంటుకోవడంతో ముగ్గురు సజీవ దహమైనట్లు భావించిన సంఘటన మరో మలుపు తిరిగింది. ఆ సంఘటనను హత్యగా పోలీసులు గుర్తించారు. 

తండ్రి మరో మహిళతో సంబంధం పెట్టుకోవడంతో, ఎన్ని సార్లు చెప్పిన వినకపోవడంతో ముగ్గురిని యువకుడు సజీవదహనం చేసినట్లు బయటపడింది. తండ్రి, అతనితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ, తన నానమ్మలను అతను సజీవ దహనం చేశాడు. 

వివరాలు ఇలా ఉన్నాయి - కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన మామిడి కుమారస్వామి, కౌసల్య దంపతులకు కుమారుడు కార్తీక్‌, కుమార్తె జ్యోతిక ఉన్నారు. వరంగల్‌ మండలం పైడిపల్లికి చెందిన వితంతువు పోతరాజు సుమలత(45)తో కుమారస్వామి వివాహేతర సంబంధం నడుపుతున్నాడు.

ఈ విషయంపై కార్తీక్‌ చాలా సార్లు తండ్రిని హెచ్చరించాడు. ఆదివారం తన తాత ఇంట్లో తండ్రి, సుమలత ఉన్నట్లు తెలుసుకుని వారిని కడతేర్చాలని పెట్రోల్‌ సీసాతో వెళ్లాడు. కుమారస్వామిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి ఇంట్లోకి తోసి తలుపులు వేశాడు. అతను సిలిండర్‌పై పడటంతో అది పేలి ఇంట్లో నిద్రిస్తున్న రాజమ్మ, సుమలత(45) మరణించారు.

loader