అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యను చంపిన భర్త

Affair: Husband kills wife at Gandipet
Highlights

న భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, అందుకే చంపేశానని గౌస్ పాషా చెప్పాడు. 

హైదరాబాద్: తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, అందుకే చంపేశానని గౌస్ పాషా చెప్పాడు. హైదరాబాదులోని గండిపేటలో అతను తన భార్యను హత్య చేశాడు. అతన్ని నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రిమాండ్ కు తరలించారు. 

పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి - గండిపేటకు చెందిన గౌస్ పాషా (35) గోల్కొండకు చెందిన షాహిన్ బేగం (30)ను వివాహం చేసుకున్నాడు. వారికి మూడేళ్ల కుమారుడు ఉండేవాడు. అతను ఏడాది క్రితం అనారోగ్యంతో మరణించాడు. 

గౌస్ పాషా తను చేస్తున్న వాచ్ మన్ ఉద్యోగాన్ని వదిలేసి ఇంటి వద్దే ఉంటూ వస్తున్నాడు. దాంతో భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవలు జరుగుతూ వచ్చాయి. గత బుధవారంనాడు గౌస్ పాషా భార్యను చితకబాది కత్తితో గొంతు కోసి చంపాడు. బుధవారం తెల్లవారు జామున గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

శుక్రవారం గౌస్ పాషా నార్సింగ్ కు వచ్చాడు. దాంతో అతన్ని అరెస్టు చేశారు. అతను నేరాన్ని అంగీకరించాడు.

loader