శ్రీశైలం: శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఏఈ సుందర్ నాయక్ తన కుటుంబసభ్యులకు ఫోన్ చేశాడు. చిన్న ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలిసినా భయపడొద్దని ఆయన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో గురువారం నాడు రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఏఈ సుందర్ కుమార్ తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసినట్టుగా ఆయన సోదరుడు శుక్రవారం నాడు మీడియాకు చెప్పారు.

ప్రమాదం జరిగిన తర్వాత మా అన్న మా వదినతో మాట్లాడినట్టుగా ఆయన వివరించారు. అగ్ని ప్రమాదం జరిగినట్టుగా కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. 
ఈ విషయం మీకు తెలిసినా భయపడొద్దని కూడ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. చిన్న ప్రమాదమేనని ఆయన కుటుంబసభ్యులకు చెప్పారు.

also read:శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్ని ప్రమాదం: కరోనాను జయించాడు.. మృత్యువు ముందు ఓడాడు

మరోవైపు ఇదే ప్లాంట్ లో పనిచేస్తున్న ఏఈ మోహన్ కుమార్ కూడ తన వైపుకు ఎవరూ కూడ రావొద్దని కూడ ఇతర ఏఈలను అలెర్ట్ చేశాడు. ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్పాడు. ఐదు నిమిషాల్లో చనిపోతున్నా.. రావొద్దని చెప్పాడు.

సుందర్ నాయక్ సైరన్ మోగిస్తూ ప్లాంట్ నుండి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు.ఈ క్రమంలోనే ఆయన మెట్లపైనే పడి మరణించాడు. అగ్ని ప్రమాదం కారణంగా పొగ ఏర్పడింది. ఈ పొగతో శ్వాస తీసుకోవడానికి కూడ ఇబ్బందులు ఏర్పడ్డాయి. మృతదేహలు కాలిపోయి ఉండడాన్ని చూస్తే  అగ్ని ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా అధికారులు అభిప్రాయపడుతున్నారు.