Asianet News TeluguAsianet News Telugu

చిన్నారి హత్య: ఇద్దరితో అఫైర్ ఆమె కూతురిని బలి తీసుకుంది

ఇద్దరితో సాగించిన స్నేహం కారణంగా ఓ మహిళ తన ఆరేళ్ల కూతురిని కోల్పోయింది. తెలంగాణలో ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన హత్యలో కొత్త కోణం వెలుగు చూసింది. మహిళ మిత్రుడే ఆమె కూతురిని హత్య చేశాడు.

Adya killed by mother's friend in Medchal district
Author
Ghatkesar, First Published Jul 2, 2020, 7:06 PM IST

మేడ్చెల్: తెలంగాణలోని మేడ్చెల్ జిల్లా ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఆరేళ్ల చిన్నారి హత్య కేసు వివరాలను డీసీపీ వెల్లడించారు. తల్లి అనూష మిత్రుల్లో ఒక్కడైన కరుణాకర్ ఆద్యను హత్య చేశాడు. ఆద్యను చంపడానికి కరుణాకర్ సర్జికల్ కత్తిని వాడినట్లు డీసీపీ చెప్పారు. 

కల్యాణ్, అనూష దంపతుల కూతురు ఆద్య అని, కరుణాకర్ ఆణె గొంతు కోశాడని, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మరణించిందని డీసీపీ చెప్పారు. అనూష, రాజశేఖర్, కరుణాకర్ ముగ్గురు మిత్రులని, హత్య జరిగిన సమయంలో రాజశేఖర్ ఇంట్లోనే ఉన్నాడని డీసీపీ చెప్పారు. 

అనూష రాజశేఖర్ కు దగ్గరై తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో కరుణాకర్ ఆద్యను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. అనూష, కల్యాణ్ లకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఆరేళ్ల కూతురు ఆద్య ఉంది. కొన్నాళ్ల క్రితం అనూషకు కరుణాకర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది అక్రమ సంబంధానికి దారి తీసింది. 

విషయం తెలియడంతో భర్త ఆమెను మందలించాడు. దాంతో ఆమె కరుణాకర్ ను దూరం పెట్టడం ప్రారంభించింది. దీంతో ప్రియురాలిపై తీవ్రమైన కోపంతో కరుణాకర్ ఆద్యను చంపాడని కూడా అంటున్నారు. సికింద్రాబాదులోని భవానీనగర్ కు చెందిన కరుణాకర్ తో అనూషకు మూడు నెలల క్రితం ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. 

గత కొద్ది రోజులుగా అనూష రాజశేఖర్ అనే యువకుడితో సన్నిహితంగా ఉండడాన్ని కరుణాకర్ గమనించాడు. దీంతో కరుణాకర్ కు కోపం వచ్చింది. ఈ స్థితిలో గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కరుణాకర్ అనూష ఇంటికి వచ్చాడు. కరుణాకర్ రాకను గమనించి రాజశేఖర్ ను బాత్రూంలో దాచింది. 

బయటకు రావాలని కరుణాకర్ రమేష్ పై ఒత్తిడి పెట్టాడు. బయటకు రాకపోతే చిన్నారి ఆద్యను చంపుతానని బెదిరించాడు. అయినా అతను బయటకు రాలేదు. దాంతో చిన్నారి గొంతు కోసి హత్య చేశాడు. అద్య అరుపులతో రమేష్ బయటకు వచ్చాడు. రమేష్ మీద కరుణాకర్ కత్తితో దాడి చేశాడు. దాంతో రమేష్ పరుగు తీశాడు. ఆ తర్వాత కరుణాకర్ తన గొంతు కోసుకున్నాడు. కరుణాకర్ ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios