తనపై వచ్చిన లైంగిక ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఓ అడ్వకేట్  బాత్రూమ్ క్లీనింగ్ కోసం వాడే హార్పిక్ తాగేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రామారావు అనే వ్యక్తి అడ్వకేట్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా.. అతను తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ జూనియర్ అడ్వకేట్ పోలీసులును ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతనిని విచారించేందుకు అడ్వకేట్ ఇంటికి వచ్చారు.

పోలీసులు తనను అరెస్టు చేస్తారన్న విషయం అర్థమైన రామారావు భయంతో వణికిపోయాడు.వెంటనే తన ఇంట్లోని బాత్రూమ్ లోని హార్పిక్ ని తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన పోలీసులు అతనిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.