కేసిఆర్ పై అడ్వొకెట్ రచనా రెడ్డి ఫైర్

First Published 4, Apr 2018, 2:34 PM IST
advocate Rachana Reddy targets chief minister KCR
Highlights
తెలంగాణ జన సమితి సభలో లాయరమ్మ కామెంట్స్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై ప్రముఖ అడ్వొకెట్ రచనారెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ జరిగిన తెలంగాణ జన సమితి జెండా ప్రకటన సభలో ఆమె పాల్గొన్నారు. సభలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ సిఎం కేసిఆర్ పై విమర్శల వర్షం కురిపించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ గురించి కేసిఆర్ మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. నేరెళ్ల దళితులను ఇసుక మాఫియా లారీలు ఎక్కించి చంపిన విషయం కేసిఆర్ కు గుర్తు లేదా అని ప్రశ్నించారు.

ముందు ఇసుక మాఫియా హత్యలపై కేసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసిఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదని రచన ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యల పరిష్కరించేందుకే తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భవించిందన్నారు.

తెలంగాణ వాదులకు ఈ పార్టీ ఏర్పాటు తర్వాత సరైన వేదిక దొరికిందని, తెలంగాణ ద్రోహులకు గుణపాఠం చెప్పేందుకు అందరూ కలిసి ముందుకు సాగాలన్నారు.

 

loader