తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా చిట్టిగద్ధ కల్లు ఘటనకు సంబంధించిన ప్రభుత్వానికి ల్యాబ్ రిపోర్ట్ చేరింది. డిపోలో కల్లు కల్తీ చేసినట్లు నివేదికలో స్పష్టమైంది.

వారం క్రితం కల్తీ కల్లు తాగి వికారాబాద్ జిల్లాలో పలువురు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. కల్లులో డైజోఫామ్‌ను కలిపినట్లు నిర్థారణ అయ్యింది. ఈ కల్లును తాగిన పది గ్రామాల ప్రజలు వింతగా ప్రవర్తించారు.

Also Read:వికారాబాద్ : నోటి వెంట రక్తం, పిచ్చి ప్రవర్తన.. పెరుగుతున్న కల్లు బాధితులు

ఈ ఘటనలో వందలాది మంది అస్వస్థతకు గురవ్వగా.. ముగ్గురు మరణించారు. కల్తీ కల్లు తాగడం వల్లే వీరు మరణించారని ల్యాబ్ నివేదిక తేల్చి చెప్పింది. వికారాబాద్ కల్లు ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది.  

కల్లు సంఘాల మధ్య విభేదాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.  ఇప్పటికే చిట్టిగిద్ద కల్లు డిపో సీజ్ చేసిన ఎక్సైజ్ శాఖ..లోతుగా దర్యాప్తు చేస్తోంది.