Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీ బస్సులోనే మహిళ ప్రసవం… పురుటి నొప్పులు వస్తుంటే.. ఆ డ్రైవర్ ఏం చేశాడంటే..

ఓ ఆదివాసీ  మహిళ ఆర్టీసీ బస్సులోనే ప్రసవించింది. డ్రైవర్ జాగ్రత్త వల్ల తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. బస్సులో పుట్టిన ఆ చిన్నారికి ఆర్టీసీ ఎండీ జీవితకాలం పనికొచ్చే ఓ అపురూప కానుక ఇచ్చారు. 

adivasi woman giving birth in RTC bus in Adilabad
Author
Hyderabad, First Published Jun 27, 2022, 7:13 AM IST

అదిలాబాద్ : పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆ adivasi womanకు  ఆర్టీసీ బస్సే ఆసుపత్రిగా మారింది.  బస్సు డ్రైవరే డాక్టర్ అయ్యాడు. ఈ ఘటన Adilabad జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… మహారాష్ట్రలోని కిన్వట్ తాలూకా సింగరి వాడకి చెందిన గర్భిణీ మడావి రత్నమాల ఇంద్రవెల్లి నుంచి అదిలాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరింది. గుడిహత్నూర్ మండలం మనకాపూర్ వద్దకు రాగానే పురుటి నొప్పులు రావడంతో విషయం తెలిసి డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. ఆర్టీసీ బస్సులోనే ఆదివాసి మహిళ Male childకు జన్మనిచ్చింది.

బస్సును ఆపేసిన తరువాత.. 108కి ఫోన్ చేసినా.. వాహనం సకాలంలో రాకపోవడంతో వెంటనే డ్రైవర్ బస్సును నేరుగా గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి తల్లీబిడ్డలను అక్కడ చేర్పించాడు. పరీక్షించిన అక్కడి ఆరోగ్య సిబ్బంది తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు చెప్పడంతో.. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ తో పాటు ప్రయాణికులు అందరూ సంతోషించారు.  సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ డీవీఎం మధుసూదన్, డీఎం విజయ్  ఆసుపత్రికి చేరుకుని తల్లి బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటన మేరకు పుట్టిన బాబు జీవిత కాలం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే విధంగా ఉచిత బస్ పాస్ అందిస్తామని తెలిపారు.

డ్రైవర్, కండక్టర్ లకు అభినందనలు…
తల్లీబిడ్డలు సురక్షితంగా ఆస్పత్రికి తరలించిన బస్సు డ్రైవర్ కండక్టర్ సిహెచ్ గబ్బర్సింగ్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి,  సీఎండీ సజ్జనార్ అభినందించారు.  ఆ బిడ్డకు భగవంతుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ల ఆయుష్షు ప్రసాదించాలని కోరుకున్నారు.

పాకిస్తాన్ లో దారుణం.. కడుపులోనే తల ఉంచేసి, కుట్టేసి.. ప్రసవం కోసం వస్తే నరకం చూపించారు..

ఇదిలా ఉండగా, మే 19న గద్వాల ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోనే ఆటోలో మహిళ ప్రసవించింది. అయితే, దీనికి ఆస్పత్రి Medical staff నిర్లక్ష్యమే కారణమంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది.  ఇందుకు సంబంధించి బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... గద్వాల పట్టణానికి చెందిన అరుణ అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో  కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం 5.10 గంటలకు ఆటోలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆవరణలోనే 30 నిమిషాల పాటు ఆటోలోనే ఉన్నా సిబ్బంది సరిగా స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తీరా ఉదయం 5.42 నిమిషాలకు ఆటోలోనే గర్భిణీ ప్రసవించినా ఎవరూ స్పందించలేదని వాపోయారు.

ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణం అంటూ కొందరు ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అప్పుడు స్పందించారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపర్డెంట్ కిషోర్ కుమార్ స్పందిస్తూ తమ సిబ్బంది నిర్లక్ష్యం లేదు అన్నారు. ఆస్పత్రికి వచ్చి సీసీ కెమెరాలు పరిశీలించాలన్నారు. గర్భిణీ వచ్చే సమయానికే పరిస్థితి సీరియస్ గా ఉండడంతో ఆటోలోనే ప్రసవించిందన్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నతమైన సేవలు అందిస్తున్నామని.. ఇలా తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios