ఆదిలాబాద్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే  కిషన్ రెడ్డి సీఎం అవుతారని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు చెప్పారు.

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగుర వేయడం ఖాయమన్నారు. ఆదిలాబాద్ వెనుకబడ్డ జిల్లా కాదు.. వెనుకపడేయబడిన జిల్లా అని ఆయన చెప్పారు. 

జిల్లాలోని ఆదీవాసీలను ప్రభుత్వం అణిచివేస్తోందన్నారు. పోడుభూములపై అటవీశాఖ ఆంక్షలను కొనసాగించడాన్ని ఆయన తప్పుబట్టారు. పులి దాడులను చూపి గిరిజనులను వెళ్లగొట్టే కుట్ర జరుగుతోందని చెప్పారు. 

తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు దక్కించుకోవడం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపింది.2023 ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసం బీజేపీ నాయకత్వం ఇప్పటి నుండే కసరత్తు చేస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు బీజేపీ ఇప్పటి నుండే పావులు కదుపుతోంది. ఇతర పార్టీల్లోని అసంతృప్తులను తమ వైపునకు తిప్పుకొనేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది.