ఆదిలాబాద్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతీ, సంప్రదయాలకు పుట్టిల్లుగా ఆదిలాబాద్‌ను పరిగణిస్తారు. తెలంగాణలో అత్యధిక అటవీ ప్రాంతం ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోనే వుంది. కొండ కోనలు, విస్తారమైన అటవీ ప్రాంతం, గోదావరి గలగలలు, చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువైయున్న బాసర ఆదిలాబాద్ పరిధిలోనే వుంటుంది.  బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా పేరుతో ఆదిలాబాద్ ఏర్పడింది. పూర్వకాలంలో దీనిని ఎద్దులపురం, ఎడ్లవాడగా పిలిచేవారు. గొండు, నాయక్‌పొట్, కొలామ్, లంబాడీ తెగల ఆధిపత్యం ఆదిలాబాద్‌లో వుంది. ఎన్నికల్లో అభ్యర్ధుల జయాపజయాలు వీరిపైనే ఆధారపడి వున్నాయి.  ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో తొలుత కాంగ్రెస్ పార్టీదే హవా, ఆ తర్వాత తెలుగుదేశం ఈ స్థానాన్ని తన కంచుకోటగా మార్చుకుంది. 

adilabad lok sabha elections result 2024 ksp

ఎడ్లవాడ అంటే తెలియకపోవచ్చు.. కానీ ఆదిలాబాద్ అంటే తెలుగు ప్రజలకు సుపరిచితం. బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా పేరుతో ఆదిలాబాద్ ఏర్పడింది. పూర్వకాలంలో దీనిని ఎద్దులపురం, ఎడ్లవాడగా పిలిచేవారు. ఎడ్ల సంత కారణంగా.. ఈ ప్రాంతానికి ఈ పేరొచ్చినట్లుగా చరిత్ర చెబుతోంది. తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతీ, సంప్రదయాలకు పుట్టిల్లుగా ఆదిలాబాద్‌ను పరిగణిస్తారు. తెలంగాణలో అత్యధిక అటవీ ప్రాంతం ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోనే వుంది. కొండ కోనలు, విస్తారమైన అటవీ ప్రాంతం, గోదావరి గలగలలు, చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువైయున్న బాసర ఆదిలాబాద్ పరిధిలోనే వుంటుంది. నిర్మల్ బొమ్మలు, సాంప్రదాయ గిరిజన నృత్యాలకు ఈ ప్రాంతం పుట్టిల్లు. ఆదివాసీల ఓట్లే అభ్యర్ధుల గెలుపోటముల్లో కీలకం కానున్నాయి. 

ఆదిలాబాద్ ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. శాసించేది గిరిజనులే :

ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో ఎస్టీలకు రిజర్వ్ కాగా.. మిగిలిన సెగ్మెంట్లలో గిరిజనుల ప్రాబల్యం ఎక్కువ. గొండు, నాయక్‌పొట్, కొలామ్, లంబాడీ తెగల ఆధిపత్యం ఆదిలాబాద్‌లో వుంది. ఎన్నికల్లో అభ్యర్ధుల జయాపజయాలు వీరిపైనే ఆధారపడి వున్నాయి. 1952లో ఏర్పడిన ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో తొలుత కాంగ్రెస్ పార్టీదే హవా, ఆ తర్వాత తెలుగుదేశం ఈ స్థానాన్ని తన కంచుకోటగా మార్చుకుంది. కాంగ్రెస్ ఇక్కడ 8 సార్లు, టీడీపీ 6 సార్లు, బీఆర్ఎస్ రెండు సార్లు , బీజేపీ , సోషలిస్ట్ పార్టీలు ఒక్కోసారి ఆదిలాబాద్‌లో గెలిచాయి. 

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో బీజేపీ నాలుగు , బీఆర్ఎస్ రెండు , కాంగ్రెస్ ఒక చోట విజయం సాధించాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి సోయం బాపూరావుకు 3,77,374 ఓట్లు.. బీఆర్ఎస్ అభ్యర్ధి గోదం నగేష్‌కు 3,18,814 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్ధి రమేశ్ రాథోడ్‌కు 3,14,238 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీజేపీ 58,560 ఓట్ల తేడాతో ఆదిలాబాద్ ఎంపీ సీటును కైవసం చేసుకుంది. 

ఆదిలాబాద్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024 .. బీజేపీ పట్టు నిలుపుకునేనా :

తెలంగాణలో దాదాపు 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచి దాదాపు 16 ఏళ్లు కావొస్తోంది. చివరి సారిగా 2008లో హస్తం ఇక్కడ విజయం సాధించింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆదిలాబాద్ టికెట్ కోసం కాంగ్రెస్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, నరేశ్ జాదవ్, శ్రావణ్ నాయక్, పంద్రం జైవంత్ రావు, అడె గజేందర్‌లు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ విషయానికి వస్తే.. కేసీఆర్ అభ్యర్ధి ఎంపికపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

బీజేపీలో మాత్రం ఆదిలాబాద్ టికెట్ కోసం ఆశావహుల జాబితా భారీగా వుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు స్థానాలకు గాను నాలుగు చోట్ల బీజేపీ విజయం సాధించింది. దీనికి తోడు సిట్టింగ్ ఎంపీ కూడా ఆ పార్టీకే చెందినవారు కావడంతో నేతలు ఎవరికి వారు లాబీయింగ్ చేస్తున్నారు. మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, జెడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్థన్‌‌లతో పాటు ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎంపీ గొడం నగేశ్‌లు ఆదిలాబాద్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios