రెండు రోజుల క్రితం ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో గాయపడిన ఆదిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అజర్, మహమూద్ లు ఆదిల్ పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో గాయపడిన ఆదిల్ ఉస్మానియాలో చికిత్స పొందుతూ మరణించారు.
హైదరాబాద్: నగరంలోని Erragadda ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదిల్ అనే వ్యక్తి ఆదివారం నాడు మరణించాడు. ఈ నెల 8వ తేదీ రాత్రి ఎర్రగడ్డ Mental Hospital ఆవరణలో ఓపెన్ గ్రౌండ్ లో ఆదిల్ , అజర్, మహమూద్ అలీలు గొడవ పడ్డారు. ఈ ముగ్గురి మధ్య మాటా మాటా పెరిగింది. ముగ్గురు గొడవ పడ్డారు. ఈ గొడవ ముదరడంతో ఆదిల్ పై అజర్, మహమూద్ లు Petrol పోసి నిప్పంటించారు.
దీంతో మంటలకు తాళలేక ఆదిల్ అక్కడి నుండి పరుగెత్తాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఆదిల్ ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదిల్ ఇవాళ మరణించినట్టుగా పోలీసులు తెలిపారు.
Adil ను పిలిపించి ఇద్దరు నిందితులు అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసులు తెలిపారు. ఆదిల్ ను ఆసుపత్రికి తరలించే సమయానికే అతను 90 శాతానికి పైగా కాలిపోయాడని వైద్యులు తెలిపారు. ఆదిల్ పై పెట్రోల్ పోసిన నిందితులపై గతంలో కేసులున్నాయని పోలీసులు తెలిపారు. ఆదిల్ మరణించడంతో ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా SR Nagar పోలీసులు తెలిపారు.
