Asianet News TeluguAsianet News Telugu

ప్రేమ, పెళ్లి పేరుతో నవీన్ రెడ్డి నా కూతురిని వేధించాడు.. పోలీసులకు యువతి తండ్రి ఫిర్యాదు..

హైదరాబాద్‌ శివార్లలోని మన్నెగూడలో బీడీఎస్ విద్యార్థిని కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి  తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి యువతి తండ్రి దామోదర్ రెడ్డి ఆదిభట్ల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Adibatla kidnap case Police files case on naveen reddy after young Woman Father Complaint
Author
First Published Dec 10, 2022, 1:03 PM IST

హైదరాబాద్‌ శివార్లలోని మన్నెగూడలో బీడీఎస్ విద్యార్థిని కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి  తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి యువతి తండ్రి దామోదర్ రెడ్డి ఆదిభట్ల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నవీన్‌ రెడ్డి, అతని అనుచరులపై ఆధిభట్ల పోలీసులు హత్యయత్నం, కిడ్నాప్, దాడితో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

తన కూతురుతో నవీన్ రెడ్డికి ఓ బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రంలో  పరిచయం ఏర్పడిందని దామోదర్ రెడ్డి ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు. ప్రేమ, పెళ్లి పేరుతో తన  కూతురును వేధించాడని ఆరోపించారు. శుక్రవారం ఉదయం నవీన్ రెడ్డి 50 మంది అనుచరులతో తన ఇంటిపై దాడి చేశాడని చెప్పారు. కారులో ఐరన్ రాడ్లు, రాళ్లు తీసుకుని తన ఇంటిపై దాడి చేశాడని తెలిపారు. తనను చంపాలని చూశారని ఆరోపించారు. అడ్డుకున్న తన స్నేహితులపై కూడా దాడి చేశారని చెప్పారు. వైశాలిని బలవంతంగా కారులో ఎక్కించి వెళ్లిపోయాడని తెలిపారు. ఇంట్లో సామాగ్రి, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారని చెప్పారు. ఇంటి దగ్గర ఉన్న వాహనాలను కూడా ధ్వంసం చేశారని తెలిపారు. 

ఇదిలా ఉంటే..తన కూతురుతో పెళ్లి అయిందని నవీన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని దామోదర్ రెడ్డి. తన కూతురితో కలిసి దిగిన ఫొటోలను నవీన్ రెడ్డి  పెళ్లి జరిగిందనే ప్రచారానికి వాడుకున్నారని విమర్శించారు. తన సొంత గ్రామంలో కూడా తనను బద్నామ్ చేసే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. తన కూతురును సొంతం చేసుకోవాలనే  నవీన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఉదయం తన కూతురు నిశ్చితార్థానికి కొన్ని గంటల ముందు నవీన్ రెడ్డి తన కూతురును అపహరించి ఉదయం 11:30 గంటలకు కారులో తీసుకెళ్లారని చెప్పారు. అడ్డుకోవడానికి యత్నించిన తనపై ఇనుప రాడ్‌తో తలపై కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయానని తెలిపారు. తాను తేరుకునే సమయానికి తన కూతురు కనిపించలేదని అన్నారు. పలువురు కుటుంబ సభ్యులపై నవీన్ రెడ్డితో వచ్చినవారు దాడి  చేశారని ఆరోపించారు. ఆ సమయంలో పోలీసులకు ఫోన్ చేసిన కూడా స్పందించలేదని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios